
పేదల కోసం దళిత బంధు గృహలక్ష్మి పథకాలకు ప్రభుత్వ మరో అవకాశం. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గళం న్యూస్ మునగాల 6/10/2023 దళిత బంధు, గృహలక్ష్మి పథకాలకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు మరో అవకాశం ప్రభుత్వం కల్పించిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాలకు చెందిన వారు ఎంపీడీవో కార్యాలయంలో పట్టణ ప్రాంతం వారు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించిందన్నారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్హులైన వారందరికీ దళిత బంధు గృహలక్ష్మి పథకాలు అందిస్తామన్నారు.