
దళిత రత్న అవార్డు అందుకున్న- సీనియర్ జర్నలిస్ట్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిఉత్సవాలు–2025లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే దళితరత్న అవార్డును ఈసారి హన్మకొండ జిల్లా తాటికాయల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ముచ్చట్లు దినపత్రిక ఎడిటర్, తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లెపాక రాజేష్అందుకున్నారు.ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు మాదిగ ఈ విషయాన్ని ప్రకటించారు. శనివారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో కమిటీ వర్కింగ్ చైర్మన్ ఇటుక రాజు చేతుల మీదుగా బొల్లెపాక రాజేష్ అవార్డును స్వీకరించారు.
అవార్డు స్వీకరించిన అనంతరం బొల్లెపాక రాజేష్ మాట్లాడుతూ, “ఈ గౌరవం వ్యక్తిగతంగా నాకు మాత్రమే కాకుండా, జర్నలిజం రంగంలో కష్టపడుతున్న ప్రతి దళిత పాత్రికేయుడికి లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. సమాజంలో అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచే బాధ్యత మనదని, అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమానత్వం, న్యాయం కోసం కలం పాడుతుంది. పేదల సమస్యలు, అణగారిన వర్గాల సమస్యలు వెలుగులోకి తెచ్చేందుకు నా జర్నలిస్టు ప్రస్థానాన్ని మరింత అంకితం చేస్తాను” అని పేర్కొన్నారు.
అవార్డుకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి,
అంబెడ్కర్ జయంతి ఉత్సవాల కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్, మాదిగ జర్నలిస్ట్ ఫోరమ్ వ్యవస్థాపక అధ్యక్షులు బూర్గుల నాగేందర్, మాదిగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వీరేందర్ మాదిగ, దళిత సంఘాల నాయకులు రమేష్, సుమన్, నిర్మల్, రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.