•అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని,ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి,మునిసిపల్,పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.ఈరోజు బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ..దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.విద్యుత్,నీటి సరఫరా,పారిశుధ్యం,భద్రత,ఆరోగ్య సదుపాయాలు,ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు.అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని,ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు.ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉంటా వెంట భూపాలపల్లి ఏరియా సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) విజయలక్ష్మి,అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్,డీఎస్పీ సంపత్ రావు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.