
శ్రీ కన్నెమూల విద్యా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్
గళం న్యూస్ పామిడి
అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణంలో గల శ్రీ కన్నెమూల విద్యా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామ నవమి సందర్బంగా పానకం వితరణ అలానే చలివేంద్రంను గ్రూపు సభ్యులు మరియు దాతల సహాయంతో ప్రారంభించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న చలివేంద్రం శుక్రవారంతో 35 రోజులు పూర్థి అయ్యింది.ప్రతీ రోజు వాటర్ క్యాన్లు పెట్టి చలివేంద్రం నిర్వహించడం జరిగింది.ఇప్పుడు దీనికి స్వస్తి చెప్పి వేసవి మూడు నెలలు చలివేంద్రం నిర్వహించాలి అని నూతన వాటర్ కూలరను దాతల సహాయముతో కొని. 24-05-2024 శుక్రవారం రోజున ఉదయం 10 గంటలకు ప్రారంభించారు.ఇప్పటి వరకు సహకరించిన దాతలకు శ్రీ కన్నెమూల విద్యా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారు ధన్యవాదములు తెలియచేశారు ఎండల తీవ్రతల దృష్ట అలానే పామిడి మెయిన్ బజార్ లో వ్యాపారస్తుల కోసం ఈ చల్లటి త్రాగునీటి చలివేంద్రంను జూన్ నెల చివరి వరకు నిర్వహిస్తామని అని గ్రూపు సభ్యులు తెలియచేసారు ఈ మహాత్కర కార్యక్రమంకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ శ్రీ కన్నెమూల విద్యా వినాయక ప్రెండ్స్ సర్కిల్ వారు కృతజ్ఞతలు తెలియచేసారు.అలాగే ప్రజల దాహం తీరుస్తున్న శ్రీ కన్నెమూల విద్యా వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారికి పామిడి పట్టణ ప్రజలు ధన్యవాదాలు తెలియచేశారు..