
మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్.
రాష్ట్ర ,జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్యారా సిట్టింగ్ వాలీబాల్ కెప్టెన్ దయ్యాల భాగ్య.
న్యూ మోడల్ జర్మనీ రైట్ లెగ్ అమరిక చికిత్సకు తన సీడీఎఫ్ ఫండ్ ఇచ్చిన ఎంఎల్ఏ.
రోబోటిక్ హాస్పటల్ లో త్వరలో చికిత్స.
ఆమె ఒక దివ్యంగా క్రీడాకారిణి, ఆమెకు అందరి లాగే దేశ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని ఒక చిన్న ఆశ.ఆ ఆశకు ఆశయానికి అడుగడుగునా అడ్డంకులు,ఐనా ఆమె కుంగలేదు,రాష్ట్ర జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్యారా దివ్యంగుల సిట్టింగ్ వాలీబాల్ కెప్టెన్ గా ఎన్నో క్రీడల్లో పాల్గొన్నది,కానీ ఆమెకు ఒక కుడి కాలు లేదు,నాకు కాలు ఉంటే ఇంకా ప్రపంచ స్థాయి క్రీడల్లో తన ప్రతిభ చుపలనే ఆశయానికి అండగా నిలబడ్డారు,మహబూబాబాద్ శాసన సభ్యులు బానోతు శంకర్ నాయక్ గూడూరు మండల కేంద్రానికి చెందిన దయ్యాల భాగ్య ఈ మధ్య శంకర్ నాయక్ ని కలిసి తన సమస్య వివరించగా వెంటనే స్పందించిన ఎంఎల్ఏ న్యూ మోడల్ జర్మనీ రైట్ లెగ్ అమరిక చికత్స కొరకు తన సీడీఎఫ్ నిధుల నుండి 2.60 లక్షల రూపాయలను మంజూరు చేసి ఆ మంజూరు పత్రాన్ని నేడు క్యాంప్ కార్యాలయంలో భాగ్య కి అందజేశారు,భాగ్య మాట్లాడుతూ ఇచ్చిన మంజూరు నిధులతో త్వరలో రోబోటిక్ హాస్పటల్ లో చికిత్స చేసుకొని నా జీవిత లక్ష్యాన్ని సాధిస్తానని తన జీవిత కోరికను తీర్చిన ఎమ్మేల్యే శంకర్ నాయక్ గారికి నేను నా కుటుంబం మొత్తం రుణపడి ఉంటామని ఎంతో మంది దాతల దగ్గరికి తిరిగి తిరిగి నాకు ఉన్న ఒక్క కాలుకు కూడా నొప్పులు వచ్చాయని కానీ వారికి కనికరం లేదని నా జీవిత కుటుంబ దేవుడు ఎమ్మేల్యే శంకర్ నాయక్ గారే నని ఆయన మళ్ళీ ఎమ్మేల్యే కావాలని మా దివ్యంగా కుటుంబాలు మొత్తం ఆయనకు అండగా ఉంటమని కష్టాల్లో అధుకునే నిజమైన నాయకుడు ఎమ్మేల్యే శంకర్ నాయక్ అని నా లాగే గతంలో ఎంతో మందికి సైకిళ్ళు,వీల్ చైర్స్,వినికిడి పరికరాలు,కృత్రిమ అవయవాలు అందజేసి ఎంతో మంది వికలాంగ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ గొప్ప మహనుబావుడు ఎమ్మేల్యే శంకర్ నాయక్ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ప్రియాంక, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మురళి గౌడ్, యుగంధర్, బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.