
దివ్యాంగులకు పెన్షన్ల పంపిణీ చేసిన-ఎమ్మెల్యే రెడ్యానాయక్
డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో దివ్యాంగులకు పెంచిన మొత్తానికి సంబంధించిన పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యా నాయక్ మాట్లాడుతూ, తెలంగాణలో ఇస్తున్న పెన్షన్లు దేశంలో ఎక్కడా ఇవ్వడంలదేన్నారు.సంఖ్యలోనేగాక, ఇచ్చే పెన్షన్ మొత్తంలోనూ అత్యధికంగా మన రాష్ట్రమే ఇస్తుందన్నారు. సీఎం కెసిఆర్ మనసున్న మహారాజు, అందుకే ఆయన మావనీయ కోణంలో పెన్షన్లు ఇస్తున్నారు. దాదాపు 40లక్షల మందికి పైగా పెన్షన్లు అందుతున్నాయన్నారు. ఒంటి మహిళలు, బీడీ కార్మికులు, ఎయిడ్స్, బోదకాలు, డయాలసిస్ పేషంట్లకు కూడా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు 4వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు. బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు అందడంలేదన్నారు. తల్లికి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారుగాజులు చేయిస్తామంటే నమ్మవచ్చా? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో పెన్షన్ల వివరాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు దివ్యాంగ పెన్షన్ దారులు మాట్లాడుతూ, సీఎం కెసిఆర్ ను, ప్రభుత్వాన్ని,రెడ్యానాయక్ అభినందించారు. తమకు పెన్షన్లు వస్తున్నాయని, సమాజంలో, ఇంట్లో గౌరవం పెరిగిందని, ఆత్మ గౌరవంతో బతుకుతున్నామని అన్నారు. తమ జన్మంతా సీఎం కెసిఆర్ కు రుణ పడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మండల పార్టీ అధ్యక్షుడు నున్న రమణ, మున్సిపల్ చైర్మన్ వీరన్న, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్, ఏడు మండలాల ఎంపీడీవో లు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు