కోదాడ లింగమంతుల స్వామి జాతర ఘనంగా నిర్వహిస్తాం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎమ్మెల్యే మాట్లాడుతూగత పాలకుల కాలంలో శిధిలమైన పోయిన చరిత్ర గల ఆలయాలను తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి వాటిని అభివృద్ధి చేసి ఆలయాలకు పూర్వవైభవం తెచ్చామని అన్నారు. కోదాడ పట్టణంలో చెరువు కట్ట వద్ద గుట్టపై నిర్మిస్తున్న లింగమంతుల స్వామి గుట్ట పైకి సీసీ రోడ్డు, చుట్టూ ప్రహరి గోడ, గ్రీనరీ తదితర పనులకు ఒక కోటి 08 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పనులను వేగవంతం చేయాలని, అనంతరం ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఫిబ్రవరి 1వ తారీఖున విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, జాతర సమయం వరకు ఆలయ నిర్మాణ పనులు పూర్తిచేసి పెద్ద ఎత్తున జాతర నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కోదాడ ప్రాంతవాసులకు లింగమంతుల స్వామి ఆలయం కొంగుబంగారంగా నిలుస్తుంది అన్నారు. ఆలయాల నిర్మాణంతో చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయడమే కాకుండా విలువలతో కూడిన ఆధ్యాత్మికతను సమాజంలో కాపాడవచ్చు అన్నారు. గుట్టపైకి కోటి 08 లక్షలతో ప్రత్యేక రోడ్డు మార్గానికి నిధులు మంజూరు చేశామని ఆయన తెలిపారు. ఆలయ నిర్మాణంలో భాగస్వాములైన దాతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరరావు, పట్టణ వార్డు కౌన్సిలర్స్, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు అధికారులు పాల్గొన్నారు.