
దోమల మందు పిచికారి
గ్రామాల్లో విపరీతమైన దోమల వల్ల డెంగ్యూ మలేరియా వంటి రోగాలు వ్యాపించకుండా గ్రామంలో దోమల మందు పిచికారి చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ అన్నారు శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం కార్యాలయాలు, పాఠశాల, కళాశాలల తోపాటు గ్రామాల్లో ఉన్న వీధులలో దోమల మందు పిచికారి చేసి గ్రామాల్లో ఎలాంటి వ్యాధులు సంభవించకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు నీటిని నిల్వ ఉంచకుండా, చెత్త చెదారం లేకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు మేకల గంగరాజు, జూనియర్ అసిస్టెంట్ వెంకన్న, అటెండర్ వెంకటేశ్వర్లు పంచాయతీ సిబ్బంది చిమట నాగరాజు సుభాని గ్రామస్తులు వెంకన్న పి శ్రీను సైదులు సందీప్ కే శ్రీను తదితరులు ఉన్నారు