
పాలేరు నియోజకవర్గం తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు,అనుబంధం సంఘాల అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలకు మనవి..
రేపు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి..
తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నం రాజశేఖర్,జూలకంటి సాగర్ రెడ్డి..
ది.30.11.2022 అనగా రేపు ఉదయం 10.00 గంటలకు పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల కేంద్రం నందు టిపిసిసి ఆదేశాల మేరకు టిపిసిసిసభ్యులు రాయల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పోడు భూములు,ధాన్యం కొనుగోలు,మరియు
ధరణి,రైతుల రుణమాఫీ,రైతు భీమా సంబంధిత అంశాలు పరిష్కరించాలని నిరసనగా ధర్నా కార్యక్రమం కలదు. కావున పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అనుబంధ సంఘాల అధ్యక్షులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని మనవి..
మీ మందడి ఇజ్రాయెల్
జిల్లా కాంగ్రెస్ నాయకులు
ఉన్నం రాజశేఖర్ జూలకంటి సాగర్ రెడ్డి
తిరుమలయపాలెం మండల కాంగ్రెస్ నాయకులు*