
ఈ69న్యూస్ హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బుధవారం కే. శ్రీధర్ రావు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుకు సమన్వయం కల్పిస్తానని తెలిపారు.అలాగే మండలంలో శాంతి భద్రతలు కాపాడేందుకు కృషి చేస్తానని,ప్రజలంతా పోలీసులకు సహకరించాలని కోరారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిపే వారిపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నూతన సీఐ స్పష్టం చేశారు.