
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండిరైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీటీసీ,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గింజపల్లి రమేష్ అన్నారు.శనివారం ఖానాపురం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎంపీటీసీ గింజపల్లి రమేష్, మండల తాసిల్దార్ సంతోష్ కిరణ్ కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మొసపోవొద్దని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల అరవై రూపాయలకు, కామన్ గ్రేడ్ రెండు వేల నలభై రూపాయల మద్దతు ధర రైతులకు అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మర్రి లక్ష్మమ్మ, పిఎసిఎస్ డైరెక్టర్లు, అధికారులు దాచేపల్లి ఇందిరా, అందే సతీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు