ధాన్యం కొనుగోలు నిరంతరం పర్యవేక్షణ జరగాలి
సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తు లను అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ స్వీకరించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ….ప్రజావాణి కార్యక్రమం లో వచ్చే దరఖాస్తు లను ఎప్పటికప్పుడు పరిష్కరించి..అర్జీ పెట్టుకున్న వారికి తగు సమాచారం అందించాలన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు,మండల స్పెషల్ అధికారులు నిరంతరం విజిట్ చేస్తూ…పర్యవేక్షణ చేయాలన్నారు.సోమవారం నాటి గ్రీవెన్స్ కార్యక్రమనికి 39 దరఖాస్తు లు రాగ!అందులో కొన్నింటి వివరాలు..జనగామ పట్టణం నందు స్వర్ణ కళామందిర్ ప్రక్కన గల తన స్థలాన్ని కొందరు కూరగాయల వ్యాపారులు దౌర్జన్యంగా ఆక్రమించి కూరగాయల వ్యాపారం నిర్వహిస్తున్నారని..ఖబ్జా చేసిన స్థలాన్ని ఖాళీ చేయించాలని శ్రీహరి అనే వ్యక్తి కోరాడు.రాజీవ్ నగర్ కాలని లో నివాసం ఉంటున్న మోతే సంధ్య ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగరలని దరఖాస్తు చేసుకుంది.ఈ కార్యక్రమం లో స్పెషల్ డిప్యుటీ కలెక్టర్,ఆర్డీవో లు,కలెక్టరెట్ ఎఓ,అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు