
నంద్యాల టౌన్ నందలి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాం ఏర్పాటు చేయాలని మరియు ప్రభుత్వ స్థలం కేటాయించి అంబేద్కర్ భవన్ నిర్మాణం చేపట్టాలని, దళితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ల తొ రెండు రోజుల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మొదటి రోజుగా ఈ దీక్షలకు యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మీ,కర్నూలు జిల్లా అధ్యక్షురాలు మాల్యా దేవీబాయి,నంద్యాల జిల్లా ఉపాధ్యక్షురాలు ముడియం సునీత, పాణ్యం నియోజకవర్గ అధ్యక్షురాలు కటికె భాను, జిల్లా ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి, బేతంచర్ల మండల అధ్యక్షురాలు కొమ్ము పెద్దక్క తదితరులు పాల్గొన్నారు.