telugu galam news e69news local news daily news telugu news
పూలే యునైటెడ్ ఫ్రంట్ నాయకులు
గళం న్యూస్ కరీంనగర్: నగర పాలక సంస్థ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని ఈరోజు నగర పాలక సంస్థ కమీషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా పూలే యునైటెడ్ ఫ్రంట్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ ఈసమాజానికి మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన సేవలుగాను వారి విగ్రహాన్ని కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో ఎర్పాటు చెయ్యాలని ఈరోజు కమీషనర్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని. మహాత్మా జ్యోతిబా పేద ప్రజలకు విధ్యా ఉండాలని భావించి సామాన్యులకు విధ్యా అందుబాటులో లేని సమయంలో వారు అట్టడుగు ప్రజలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేశారు అలాంటి మహనీయుడిని జీవితం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవడం కోసం వారి జీవిత చరిత్ర ద్వారా ఇప్పుడు ఉన్న యువకులు స్ఫూర్తి పొందేవిధంగా వారు బడుగు బలహీన వర్గాల కోసం చేసిన ప్రయత్నం తెలిసేవిధంగా మన చర్యలు ఉండాలని వారి విగ్రహాన్ని మన కరీంనగర్ నగర పాలక సంస్థ లో ఎర్పాటు చేయడం ద్వారా ఒక మనం మంచి సందేశం ఇచ్చినవారం అవుతామని ఇదివరకే అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మన కరీంనగర్ నగరపాలక సంస్థ లోనే ఎర్పాటు చేసుకుని మంచి సంప్రదాయానికి నెలకొల్పడం జరిగింది. అయోక్క ఒరవడిని కోనసాగింపుగానే మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని కూడ మన నగర పాలక సంస్థ లో ఎర్పాటు చేసి రాష్ట్రంలో వారికి ఆదర్శంగా నిలుపాలని మా విన్నపం ఈ కార్యక్రమంలో బిసి నాయకులు మేకల చంద్రశేఖర్ యాదవ్, శ్రీరాముల మున్న, తూల భాస్కర్ రావు, కొత్త అనిల్ కుమార్, సాదవేణి వినయ్ కుమార్ మెతుకు రజనీకాంత్ తదితరాలు పాల్గొన్నారు.