
ఈ69న్యూస్:నిజామాబాద్ జిల్లా చందాపూర్ గ్రామంలోని మస్జిద్ నూర్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి ఖుద్దాముల్ అహ్మదీయ్యా మరియు అత్వాలుల్ అహ్మదీయ్యా వార్షిక ఇజ్తిమా ఆదివారం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా యువకులు,బాలుర కోసం ధార్మిక విద్యా పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించగా,అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు అహ్మదుల్లాహ్ మాట్లాడుతూ..నేటి సమాజంలో యువత మొబైల్,ఇంటర్నెట్ మరియు డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,మేధావులు,సంఘం సంస్కర్తలు మరియు ప్రభుత్వ అధికారులు కలసి యువతకు అవగాహన సదస్సులు,ప్రేరణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.యువతలో సంస్కరణ జరగనిదే సమాజంలో నిజమైన మార్పు సాధ్యం కాదని ఆయన తెలిపారు.అలాగే,అహ్మదీయా రెండవ ఖలీఫా హజ్రత్ మిర్జా బషీరుద్దీన్ మహ్మూద్ అహ్మద్ బోధనలను స్మరించుతూ,ప్రతి అహ్మదీయుడు సమాజానికి సేవచేసే కార్మికుడిగా మారాలని పిలుపునిచ్చారు.“ధర్మో రక్షతి రక్షితః-ధర్మాన్ని కాపాడితే అదే మనల్ని కాపాడుతుంది”అనే శ్లోకాన్ని ప్రస్తావించి ధర్మ పరిరక్షణకు కట్టుబడాలని సూచించారు.ఈ ఇజ్తిమాలో జిల్లా యూత్ అధ్యక్షుడు మహ్మద్ ముసవ్విర్ అహ్మద్,ముబల్లిఘ్ సర్కిల్ ఇన్చార్జ్ ఫహీముద్దీన్,జిల్లా నాజీమ్ నిసార్ అహ్మద్,మౌల్వీలు ముజఫ్ఫర్ మరియు జమీల్ హాజరయ్యారు.ఖుద్దామ్,అత్వాల్,అన్సార్ సభ్యులు సహా సుమారు 50 మంది ఈ ఇజ్తిమాలో పాల్గొని ఆధ్యాత్మిక లాభం పొందారు.