
నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఇన్చార్జిల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన…ఎమ్మెల్యే డా.రాజయ్య
క్లస్టర్ ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేసి కార్యోన్ముఖులను చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
నియోజకవర్గమే నా దేవాలయం నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు వారికి సేవచేయడమే నాకు మహాభాగ్యం…ఎమ్మెల్యే డా.రాజయ్య
రానున్న ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
ప్రతి 200 ఓటర్లకు ముగ్గురు ఇంచార్జ్ ల నియామకం ద్వారా ప్రతి ఓటరుతో మాట్లాడే మార్గం సుగుమమైంది…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఇక్కడి నుండే ఎన్నికల శంఖారావం పూరిస్తున్న…ఎమ్మెల్యే రాజయ్య
ఈ రోజు…స్టేషన్గన్పూర్ మండలం , పల్లగుట్టకు వెళ్లే దారిలో గల చెరువు కట్ట దగ్గర ఎమ్మెల్యే గారి వ్యవసాయ క్షేత్రం(మామిడి తోట) నందు తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రివర్యులు , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారి ఆధ్వర్యంలో మరియు అధ్యక్షతన క్లస్టర్ ఇన్చార్జిలను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడానికి క్లస్టర్ ఇన్చార్జిలకు తగిన దిశా-నిర్దేశం చేయడం కోసం వారిని కార్యోన్ముఖులను చేయడం కోసం నిర్వహించబడిన స్టేషన్ ఘనుపూర్ నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఇంచార్జ్ ల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ & బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో బిఆర్ఎస్ పార్టీ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో మరింతగా బలోపేతం చేయడానికి మరింతగా ప్రజల చెంతకు తీసుకుపోవడానికి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడానికి రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలోని అన్ని మండలాలను క్లస్టర్లుగా విభజించి అట్టి క్లస్టర్లను సమన్వయం చేయడం కోసం క్లస్టర్ ఇన్చార్జిలను నియమించడం జరిగినది.ఆ విధంగా నియమించబడిన క్లస్టర్ ఇన్చార్జిలకు తగిన దిశ నిర్దేశం చేయడానికి వారిని రానున్న ఎన్నికలకు సమాయత్తం చేయడానికి వారిని కార్యోన్ముఖులను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని మండలాలను కలుపుకొని నియోజకవర్గస్థాయి క్లస్టర్ ఇన్చార్జిల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినదని తెలిపారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాలను క్లస్టర్లుగా విభజించడమే కాకుండా అందరినీ భాగస్వామ్యం చేయడం కోసం అందరి ఇన్వాల్వ్మెంట్ అనేది పార్టీ మరింతగా పటిష్టం చేయడానికి ఉపయోగపడుతుందని ఉద్దేశంతోటి పార్టీ కోసం అందరి సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి 200 ఓటర్లకు ముగ్గురు చొప్పున ఇన్చార్జిలను(200 మంది ఓటర్లకు ముగ్గురు చొప్పున బాధ్యులు) కూడా నియమించుకోవడం జరిగినదని తెలిపారు.
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా మొట్టమొదటగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోనే నియోజకవర్గాన్ని క్లస్టర్లుగా విభజించుకొని విభజించుకోబడిన క్లస్టర్లకు ఇన్చార్జిలను కూడా నియమించుకోవడం జరిగినది అని తెలిపారు. స్టేషన్గన్పూర్ నియోజకవర్గాన్ని మొత్తం 45 క్లస్టర్లుగా విభజించుకోవడం జరిగినది. 45 క్లస్టర్లకు గాను 327 మంది క్లస్టర్ ఇన్చార్జిలను కూడా నియమించుకోవడం జరిగినదని తెలిపారు.
మండలాల వారీగా క్లస్టర్ & క్లస్టర్ ఇంచార్జ్ ల వివరాలు:-
చిల్పూర్ మండలాన్ని 6 క్లస్టర్లుగా విభజించుకొని 42 మంది క్లస్టర్ ఇన్చార్జిలను కూడా నియమించుకోవడం జరిగినది.
ధర్మసాగర్ మండలాన్ని 6 క్లస్టర్లుగా విభజించుకుని 32 మంది క్లస్టర్ ఇంచార్జిలను నియమించుకొవడం జరిగింది.
స్టేషన్ ఘనుపూర్ మండలాన్ని 8 క్లస్టర్లుగా విభజించుకుని 50 మంది క్లస్టర్ ఇంచార్జిలను నియమించుకొవడం జరిగింది.
లింఘాలగణపురం మండలాన్ని 4 క్లస్టర్లుగా విభజించుకుని 38 మంది క్లస్టర్ ఇంచార్జిలను నియమించుకొవడం జరిగింది.
రఘునాథపల్లి మండలాన్ని 9 క్లస్టర్లుగా విభజించుకుని 60 మంది క్లస్టర్ ఇంచార్జిలను నియమించుకొవడం జరిగింది.
జాఫర్గడ్ మండలాన్ని 8 క్లస్టర్లుగా విభజించుకుని 77 మంది క్లస్టర్ ఇంచార్జిలను నియమించుకొవడం జరిగింది.
వేలేరు మండలాన్ని 4 క్లస్టర్లుగా విభజించుకుని 28 మంది క్లస్టర్ ఇంచార్జిలను నియమించుకొవడం జరిగింది.
నియోజకవర్గంలో ఉండబడిన ప్రతి ఓటరుతో మాట్లాడాలనే సదుద్దేశంతో ఓటరు ను యూనిట్ గా తీసుకొని ఓటరును దృష్టిలో ఉంచుకొని ఓటరు స్థాయికి వెళ్లి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ఉన్న ప్రతి 200 ఓటర్లకు ముగ్గురు చొప్పున ఇన్చార్జిలు ను నియమించుకోవడం జరిగినది.
నియోజకవర్గంలో ఉన్న మొత్తం 234755 ఓటర్లకు 3888 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
మండలాల వారిగా ప్రతి 200 ఓటర్లకు 3 ఇంచార్జ్ ల వివరాలు:-
చిల్పూర్ మండలంలోని 30007 ఓటర్లకు 456 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
ధర్మసాగర్ మండలంలోని 37648 ఓటర్లకు 561 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
స్టేషన్ ఘనుపూర్ మండలంలోని 40494 ఓటర్లకు 705 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
లింఘాలగణపురం మండలంలోని 30275 ఓటర్లకు 462 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
రఘునాథపల్లి మండలంలోని 40066 ఓటర్లకు 594 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
జాఫర్గడ్ మండలంలోని 31427 ఓటర్లకు 687 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
వేలేరు మండలంలోని 15170 ఓటర్లకు 233 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ మరియు గర్మిల్లపల్లి గ్రామాల్లోని 5520 ఓటర్లకు 100 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
కాజీపేట మండలంలోని రాంపూర్ మరియు ఉనికిచర్ల గ్రామాల్లోని 4148 ఓటర్లకు 90 మంది ఇంచార్జ్ లను నియమించుకోవడం జరిగింది.
క్లస్టర్ ఇన్చార్జిలు అంటే ఆ క్లస్టర్ కు మీరు ఇన్చార్జిలు మాత్రమే కాదు ఆ క్లస్టర్ కు మీరందరూ నాయకులు అని తెలిపారు కావున క్లస్టర్ ఇంచార్జ్ లందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలి ఓటరు దగ్గరికి వెళ్లినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గూర్చి ఓటరుకు వివరించే విధంగా మీరందరూ తయారు కావాలని సూచించారు.
రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా స్టేషన్గన్పూర్ నియోజకవర్గ గడ్డం మీద గులాబీ జెండా ఎగురవేసే విధంగా మీరందరూ సన్నద్ధం కావాలని అందుకు ఇప్పటినుంచే కార్యోన్ముఖులు కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ & నియోజకవర్గ BRS పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు గారు , నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసిలు , కార్పోరేటర్స్ , మండల పార్టీ అధ్యక్షులు , నియోజకవర్గ కోఆర్డినేటర్స్ , మండలాల కోఆర్డినేటర్స్ , మండలాల క్లస్టర్ ఇంచార్జ్ లు మాత్రమే , సర్పంచులు , ఎంపిటిసిలు , మార్కెట్ చైర్మన్లు-డైరెక్టర్లు , PACS చైర్మన్లు-డైరెక్టర్లు, దేవస్థాన చైర్మన్లు-డైరెక్టర్లు , గ్రామశాఖల అధ్యక్షులు , రైతు సమన్వయ సమితి జిల్లా, మండల , గ్రామ కో-ఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు