
e69 news telugu news local news
ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలో అహ్మదియ్య ముస్లిం మహిళల ఆధ్వర్యంలో నిరు పేదలకు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఇవి స్థానిక అహ్మదీయ మహిళా అధ్యక్షురాలు కాశిం బీ, నాగూర్ బీ, తాహిరా ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక మోల్వి ముహమ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. నేడు అహ్మదియ్య ముస్లిం జమాత్ ప్రపంచ వ్యాప్తంగా మానవ సేవే మాధవ సేవ అని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. అదే విధంగా నేడు ప్రపంచ శాంతి సోదరభావం గురించి కూడా కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మధార్ బీ, సైధా బీ, రసూల్ బీ, గాలిబ్ బీ, ఇమామ్ బీ, మీరా బీ, తులా బీ, మౌల బీ , జన్ బీ, స్థానిక జమాత్ సదర్ షేక్ నాసర్ సాహెబ్, మైసూర్ సాబ్, హాసన్ సాబ్, అబ్బాసలి, సిద్దా, మౌలాలి, కాసీమ్, మోల్వి బాబర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.