
games news
-ఫైనల్ లో తలపడనున్న ఖమ్మం, భద్రాచలం జట్లు
-నెహ్రూ కప్ ముగింపు వేడుకకు సర్వం సిద్ధం
భద్రాచలం : నెహ్రూ కప్ ముగింపు వేడుకకు సర్వం సిద్ధమైంది. ఆదివారం ఖమ్మం, భద్రాచలం జట్లు ఫైనల్ పోర్ లో తలపడనున్నాయి.భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో జరుగుతున్న 28వ నెహ్రూ కప్ తాళ్లూరి భారతీదేవి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో శనివారం జరిగిన సెమిఫైనల్ పోటీల్లో ఖమ్మం జట్టు, భద్రాచలం జట్టు గెలుపొంది ఫైనల్ లో ప్రవేశించాయి.
ఉదయం జరిగిన మ్యాచ్ లో చందు లెవెన్ జట్టు పై మాస్టర్స్ లెవెన్ (ఖమ్మం) జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసారు. మాస్టర్స్ జట్టులోని షబ్బు 37 బంతుల్లో 45 పరుగులు, ఠాగూర్ 22 బంతుల్లో 22 పరుగులు చేసారు. 158 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చందు లెవెన్ భద్రాచలం జట్టు 18.3 ఓవర్లలో 130 పరుగులు చేసి ఓటమి పాలయ్యారు. ఈ జట్టులోని సిద్దు నాయక్ 39 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. చందు లెవెన్ జట్టుకు చెందిన బౌలర్లు మహి, సమీర్ పాషా చెరో 3 వికెట్లు, మాస్టర్స్ జట్టు లోని మహేష్ చౌదరి 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ లో మంచి ప్రతిభ కనబరిచిన సిద్దు నాయక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును డా.పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వి. వరలక్ష్మి సాయిరాం అందజేశారు.
మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో బెస్ట్ క్రికెట్ అకాడమీ భద్రాచలం వైఎంసిసి ఇల్లెందు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన
వై ఎం సి సి ఇల్లందు జట్టు నిర్ణీత 19.5 ఓవర్లలో 108 పరుగులు సాధించారు. ఈ జట్టు లోని ప్రధ్యుమ్న 43 బంతుల్లో 32 పరుగులు చేశారు. 109 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెస్ట్ క్రికెట్ అకాడమీ భద్రాచలం జట్టు 13 ఓవర్ల లో మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించి ఫైనల్లో ప్రవేశించారు. ఈ జట్టులోని సందీప్ గౌడ్ 20 బంతుల్లో 33, తేజ 36 బంతుల్లో 32 పరుగులు సాధించారు. తేజ బౌలింగ్ లో కూడా మంచి ప్రతిభ కనబరిచి రెండు వికెట్లు తీయడంతో అతనిని మేన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ అవార్డును భద్రాచలంలోని ఐటీసీ బిపిఎల్ ప్రముఖ కాంట్రాక్టర్ పాకాల దుర్గాప్రసాద్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి,ప్రధాన కార్యదర్శి ఎం. నాగార్జున, కన్వీనర్ ఎస్ కే సలీమ్, కోశాధికారి కుంచాల సదానందం ( సిద్దు ) గౌరవ సలహాదారులు ఎస్కే అజీమ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు గుమ్ములూరు శ్రీనివాసరావు, బాలమురళీకృష్ణ,పి. తిరుమల రావు,చందు, రామకృష్ణ, పాషా,లల్లూ, శేషుబాబు,శ్రీను, ఏ బిక్షంరావు, వర్మ తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం ఉదయం ఫ్రెండ్లీ మ్యాచెస్ లో భాగంగా దేవస్థానం జట్టు, పోలీస్ లెవెన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అనంతరం ఖమ్మం, భద్రాచలం జట్ల మధ్య నెహ్రూ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుందని నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి తెలిపారు.