
న్యూ విజన్ విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన
విద్యార్థులు కేవలం పాఠశాలలో చదువుకోవడమే కాకుండా క్షేత్రస్థాయి పరిశీలనలతో విషయ పరిజ్ఞానాన్ని సులువుగా అవగాహన చేసుకోగలరని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో న్యూ విజన్ పాఠశాల విద్యార్థులు మున్సిపాలిటీని, పలు పంచాయతీ కార్యాలయాలను సందర్శించారు.ఈ సందర్భంగా కమిషనర్ మున్సిపాలిటీల విధులు, నిధులు, చేస్తున్న అభివృద్ధి పనులపై విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి విషయాలను తెలుసుకోవాలన్నారు.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రసాద్ విద్యార్థులను అభినందించారు