
mulugu news
.
ఏటూరునాగారం టౌన్ లో 50 లక్షలతో మంజూరైన సిసి రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించి శ్రీకారం చుట్టిన మండల కాంగ్రెస్ నాయకులు.
శనివారం రోజున ఏఐసీసీ మహిళ ప్రధాన కార్యదర్శి,రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ & స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క సహకారంతో జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్ నియోజకవర్గ కోర్డినేటర్ ఇర్సవడ్ల వెంకన్న సూచనలమేరకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరునాగారం టౌన్ లో ఎండీ అబ్జాల్ నుండి జీసీసీ స్టోర్ వరకు 50 లక్షలతో మంజూరైనటువంటి సీసీ రోడ్ అభివృద్ధి పనులను ప్రారంభించి శ్రీకారం చుట్టారు,నాణ్యమైన నిర్మాణంతో పనులను చేపట్టాలని సూచించిన మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, జిల్లా కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా అదికార ప్రతినిధి ముక్కెర లాలయ్య,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగరావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మండల అధికార ప్రతినిధి అక్బర్ పాషా,వార్డ్ మెంబర్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.