•అర్ధరాత్రి నుంచి పిఎసిఎస్ సొసైటీ ముందు క్యూ కట్టిన రైతులు
•యూరియా దొరకక నిరాశతో రైతులు పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయింపు
•రైతులకు అండగా నిలిచిన బిఆర్ఎస్
•రైతులను శాంత పరిచిన మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవ రెడ్డి,రేగొండ ఎస్సైలు రాజేష్,సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా అందించడంలో విఫలం అయ్యాయని అంటూ రైతులు ప్రభుత్వలకు వ్యతిరేకంగా ఉమ్మడి రేగొండ మండల కేంద్రంలో పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు.సోమవారం రెండు మండలాలకు చెందిన వివిధ గ్రామాల రైతులు తెల్లవారుజాము ఒంటి గంట నుంచే రైతు వేదిక,పిఎసిఎస్ సొసైటీ కేంద్రం దగ్గరకు రైతులు చేరుకొని యూరియా కోసం వేచి చూసిన యూరియా దొరకక పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు.అర్ధరాత్రి నుంచి రైతులు ముఖాలను కడగకుండ రైతు కుటుంబాలు మహిళలు పిల్లలు యువకులు భారీ ఎత్తున తరలివచ్చి వేరువేరుగా క్యూ లైన్ లో నిలబడ్డారు.అప్పటికే క్యూలైన్లో నిలబడిన రైతులకు టోకెన్లు అందచేయగా,రైతు వేదిక భవనం వద్ద రైతులకు యూరియా టోకెన్లు అందిస్తారని ఎదురు చూసిన రైతులకు నిరాశ ఎదురు కావడంతో ఒక్కసారిగా రైతులు పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారి పై పోలీస్ స్టేషన్ ముందు వందల సంఖ్యలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు.వారికి మద్దతుగా బీఆర్ఎస్ మండల నాయకులు కలవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడంతో,అప్పటికే మండల వ్యవసాయ అధికారి పెద్ది వాసుదేవ రెడ్డి,ఏ ఈ ఓ లు,స్థానిక ఎస్ఐలు రాజేష్,సాయి త్రిలోకనాథ్ రెడ్డి,పోలీసులు అప్రమత్తమై వారిని శాంతింప చేశారు.అర్ధరాత్రి నుంచే యూరియా కోసం లైన్లు కట్టిన రైతులు అధికారుల,ప్రభుత్వం అసమర్ధతతోనే యూరియా అందించడం లేదని,చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలంటూ రైతులు నినాదాలు చేశారు.యూరియా కోసం రోజుల తరబడి తిరిగిన అందకపోవడంతో వేసిన పంటలు కోల్పోయి,తాము అప్పుల ఊబిలో కూరుకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ,అందాల భామలకు కోట్లాది రూపాయలను ప్రజా ధనం దుర్వినియోగం చేసి,రైతులకు యూరియా అందించలేని అసమర్ధ పాలన గద్దె దిగాలంటూ రైతు బిల్లా కనికి రెడ్డి అన్నారు.రైతులు మహిళలు బిఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు అర గంట పాటు రైతులు ధర్నా నిర్వహించారు.రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు పరకాల భూపాలపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు అంకం రాజేందర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులు రోడ్డెక్కిన పరిస్థితులు లేవన్నారు.రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అంటూ విమర్శించారు.సుమారు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో స్థానిక ఏవో వాసుదేవ రెడ్డి,ఏఈఓలు,ఎస్ ఐ రాజేష్,సెకండ్ ఎస్ఐ సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి రైతులను శాంతింప చేసి యూరియా టోకెన్లు దొరకని రైతులకు,రానున్న యూరియా అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి,మాజీ సర్పంచ్ బిక్య నాయక్,బండి రమేష్ గౌడ్,రైతు నాయకులు గోగుల చంద్రాకర్ రెడ్డి తదితరులు మహిళా రైతులను యువ రైతులను శాంతింప చేసి ధర్నా కార్యక్రమాన్ని విరమింపచేశారు.