
బూడిది గోపి జిల్లా కమిటీ సభ్యులు – జోగు ప్రకాష్ సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి * )
జనగామ పట్టణంలోని అసంపూర్తిగా సంవత్సరాల తరబడి పేరుకుపోయి ఉన్న సుందరీకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని, వివిధ వార్డులలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి – జోగు ప్రకాష్ జనగామ పట్టణ కార్యదర్శి పాల్గొని మాట్లాడుతూ జనగామ పట్నంలో వివిధ వార్డులలో చెత్త, మోరీలు ఎక్కడికక్కడ పేరుకుపోయి దుర్గందం వేజచల్లుతూ, దోమలు, పందులకు ఆవాస కేంద్రాలుగా మారి ప్రజలను ఆనారోగ్యసమస్యలకు గురిచేస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రధాన రహదారుల ప్రక్కన గతంలో వేసిన ఇరుకు మోరీలు ఈమధ్య వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం త్రవ్విన కందకాలవల్ల మోరీలు కూరుకుపోవడం, నూతన ఇండ్ల నిర్మాణం, ప్రభుత్వ పథకాలలో భాగంగా భారీ వాహనాల వల్ల మోరీలు హత్తుకుపోయి ఇండ్ల వాడకంలో వచ్చేనీరు ఆ మోరీల గుండా ప్రవహించక ప్రధాన రహదారులలో చేరి పందులకు, దోమలకు నిలయాలుగా మారడం, దుర్గందం రావడం జరుగుతుందని తెలిపారు. కనీసం మున్సిపల్ శానిటేషన్ వారు పట్టించుకోకపోవడంతో ఆ ఇంటి యజమాలనే శానిటేషన్ పనులు చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు పట్టణ ప్రజలు ఇంటిపనులు, నల్లా పన్నులు, అభివృద్ధి పన్నులు చెల్లించిన పన్నుల డబ్బులు ఎటుపోతున్నాయని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాలుగా కంకరతేలిన నెహ్రు పార్క్ వద్ద నుండి మల్లన్న గుడి వైపు వెళ్లే 60 ఫీట్ల రోడ్డు అసంపూర్తి పనులవల్ల స్కూల్ పిల్లలు, స్మశాన వాటికకు వెళ్లే ప్రజలు ఆ కంకర రోడ్డు గుండా వేళ్ళడంతో కాళ్ళు మార్లపడి గాయాలు ఏర్పడి, అలాగే వాహనదారులు జారీ ప్రమాదాలబారిన పడ్డ ఘటనలున్నాయని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అట్టి పనులను సందర్శించి, పరిశీలన చేసి వెంటనే పనులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పట్టణ ప్రజలను సమీకరించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఈ పట్టణ కమిటీ సభ్యులు బోట్ల శ్రీనివాస్ బాల్నే వెంకట మల్లయ్య పల్లెర్ల లలిత ఎండి మైవెల్లి మారేడి వినోద్ భాష పాక విష్ణు కళ్యాణం కళ్యాణ్ ఎర్ర రజిత శనిగచెర్ల శిరీష ముష్పట్ల జయ సత్తిని సుకన్య తదితరులు పాల్గొన్నారు.