
కొండాపూర్ మండలం మందాపూర్ గ్రామంలో సర్వేనెంబర్ 22 గల భూమి
గత కొన్ని ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటూ ఉన్నటువంటి వారికి ఆన్లైన్లో పేర్లు నమోదు ,కొత్త పట్టా పాస్ పుస్తకాలను ఇవ్వాలని మాందాపూర్ గ్రామం నుండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది.ఈ పాదయాత్ర ప్రారంభించి , జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రలో పాల్గొని ధర్నా చేయడం జరిగింది ఈ పాదయాత్రకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ హాజరై మాట్లాడుతూ
కొండాపూర్ మండలంలోనిమహందాపూర్ గ్రామాలలో అసైన్మెంట్ 22 సర్వే నంబర్ గల భూములకు గత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒకరికి ఎకరా ,ఒకరికి 25 గుంటలు ,ఒకరికి 20 గుంటలు భూమిని పంపిణీ చేశారు అప్పటినుండి ఆ భూములో పంటలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు.మరియు కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూప్రక్షాళన పేరుతో ధరణిలో పేర్లు తొలగించడం జరిగింది. ధరణిలో పేరు లేకపోవడం వలన రైతుబంధు, రైతు బీమా ఇతర ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతున్నారు .రైతు బీమా ధరణిలో పేర్లు లేకపోవడం వలన అకాల మరణం తో చనిపోయిన రైతులకు రైతు భీమా రాక వాళ్ళ కుటుంబాలు రోడ్డుపైన పడుతున్నాయి. కాబట్టి సాగులో ఉన్నటువంటి రైతులకు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి గతంలో ఇచ్చినటువంటి పట్టా భూములు ఇచ్చిన రైతుల కు సాగుదారులకు ఆన్లైన్లో నమోదు చేసి రైతులకు పట్టా పాస్ బుక్కులు ఇచ్చి న్యాయం చేయాలన్నారు . లేనియెడల పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేవరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తరుణ అనంతరం జిల్లా డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ పాదయాత్రకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు గారు ప్రత్యక్షంగా పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు .కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి యాదవ రెడ్డి ,జిల్లా అధ్యక్షులు కే రాజయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం నర్సింలు ,రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు నరసింహారెడ్డి ,అమృతమ్మ, మరియమ్మ ,సువర్ణ ,సుశీల, రాములు ,అంజయ్య, కమలమ్మ, సుజాత, తదితరులు పాల్గొన్నారు