
పథకాల ఆశచుపి బి ఆర్ ఎస్ పార్టీలో చేర్చుకుంటున్న ఎమ్మెల్యే
సంక్షేమ పథకాలను ఆశ చూపి బి ఎస్ పి పార్టీ లోకి చేరికలు జరగకుండా కేవలం సొంత పార్టీ కార్యకర్తలకు మాత్రమే సంక్షేమ పథకాలను వర్తింప జెస్తామని ప్రజలను భయపెట్టి బి ఆర్ ఎస్ పార్టీ లోకి చేర్చుకోవడం ఎమ్మెల్యే చేతకాని తనానికి నిదర్శనం అని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. స్థానిక మండల కేంద్రంలో బీఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని రిబ్బన్ కట్ చేసి కార్యాలయానికి ప్రారంభించారు.అనంతరం నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని మాట్లాడుతూ మహనీయుల ఆశయాల సాధన,అంబేద్కర్ ఆలోచన విధానాలు,బీఎస్పీ వ్యవస్థాపకులు మాయావతి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో నకిరేకల్ లో బీఎస్పీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరి తెలంగాణ నేడు కొందరి తెలంగాణ గా మారిందని ఆరోపించారు. ఇటీవల ప్రకటించిన బిఆర్ఎస్ జాబితాలో 52 శాతం ఉన్న బీసీలకు 22 శాతం, 10 శాతం ఉన్న ఓసీలకు 50 శాతం సీట్లు కేటాయించడం విడ్డూరంగా ఉందని అన్నారు.రాష్ట్ర మహిళా కన్వీనర్ నర్రా నిర్మల మాట్లాడుతూ పథకాలను ఆశ చూపి ఓట్ల రాజకీయం చేస్తున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు. జిల్లా ఇంచార్జి ఆదిమల్ల గోవర్ధన్ మాట్లాడుతూ స్వలాభం కోసం పార్టీలు మారుతున్న నాయకులకు ప్రజలే బుద్ది చెపుతారు అని అన్నారు.బీఎస్పీ మండల అధ్యక్షులు మేడి సంతోష్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా ఉపాధక్షులు కోడి భీమ ప్రసాద్, ఈసీ మెంబర్ గ్యార మారయ్య,నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ ఉపాధక్షులు పావిరాల నర్సింహా యాదవ్,నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ, చిట్యాల మండల అధ్యక్షులు గ్యార శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి నకరికంటి నరసింహ తదితరులు పాల్గొన్నారు