పర్సంటేజ్ పేరుతో కార్మికుల జీతాల దోపిడీ ఆపాలి
కాంట్రాక్ట్ కార్మికుల కడుపు కొట్టే చర్యలను సిఐటియు తీవ్రంగా ఖండిస్తోంది
ఎర్రగడ్డ మానసిక వైద్యశాల ముందు నిరసన ధర్నా
ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ కార్మికులపై“పర్సంటేజ్”పేరుతో యాజమాన్యం సాగిస్తున్న జీతాల దోపిడీకి వ్యతిరేకంగా సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ఆస్పత్రి ముందు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించబడింది.కాంట్రాక్ట్‌కు సంబంధించిన పర్సంటేజ్‌కు కార్మికులకు ఎలాంటి సంబంధం లేకపోయినా,నవంబర్ నెలలో 91 శాతం,డిసెంబర్ నెలలో 92 శాతం వచ్చిందని క ఒక్కో కార్మికుడి జీతం నుండి సుమారు ఎక్కువ నెలలో వెయ్యి రూపాయలు చొప్పున కట్ చేయడం అమానుషం,అక్రమం,కార్మిక వ్యతిరేక చర్య అని సిఐటియు నాయకులు అశోక్ మండిపడ్డారు.ఇలా 200 మంది కార్మికుల నుంచి రెండు నెలల పాటు లక్షల రూపాయల జీతాలను దోచుకోవడం కార్మికుల కుటుంబాలను ఆకలి,అప్పుల పాలుచేసే చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇది కార్మిక చట్టాలకు,మానవత్వానికి పూర్తిగా విరుద్ధమైన చర్య అని తెలిపారు.కట్ చేసిన మొత్తాన్ని వెంటనే కార్మికుల అకౌంట్లలో జమ చేయాలని,ఆలస్యం చేయకుండా సోమవారం లోపు పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.లేనియెడల మంగళవారం రోజు విధులు బహిష్కరించి ధర్నా,సమ్మెతో పాటు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని యాజమాన్యానికి సిఐటియు స్పష్టంగా హెచ్చరించింది.ఈ నిరసన కార్యక్రమంలో
సిఐటియు యూనియన్ సెక్రటరీ సైదయ్య,ఓం ప్రకాష్,శ్రీధర్,భాగ్య,లక్ష్మి,అమేందర్ తదితర నాయకులు,కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు