
పలు గ్రామాల ప్రజల నీటి ఇబ్బందులు తీర్చండి
కరివిరాల క్రాస్ రోడ్ లో గత కొంత కాలంగా బోరు పనిచేయక పలు గ్రామాల ప్రజలు నీటి ఇబ్బందులకు గురవుతున్నారని కాగిత రామచంద్రపురం నివాసి కాంపాటి జోగయ్య అన్నారు. కరివిరాల క్రాస్ రోడ్డులో మంచినీటి నీటి బోరు కాగిత రామచంద్రపురం , కేశవాపురం ,వెంకట్రాంపురం గ్రామాల ప్రజలకు రాకపోకల కేంద్రంగా మారి ప్రజల దాహార్తిని తీర్చుతుందన్నారు.
ఆయా గ్రామాల వారు ఖమ్మంకు వ్యాపార, వైద్య నిమిత్తం నిత్యం వెళ్తుంటారని అలాగే నియోజకవర్గ కేంద్రమైన కోదాడకు, జిల్లా కేంద్రమైన సూర్యాపేటకు మండల కేంద్రమైన నడిగూడెంకు ఆ మార్గం నుండే వెళుతూ ఉంటారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు త్రాగునీటి సౌకర్యంగా ఉన్న బోరు మరమ్మత్తుల పట్ల అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.ఈ బోరును అధికారుల పరీక్షలు నిర్వహించగా త్రాగునీటికి అనుకూలంగా ఉందని తేల్చడంతో చుట్టుపట్టు గ్రామాల ప్రజలు క్యాన్ల ద్వారా సైకిళ్లు మోటార్ సైకిల్ ఆటోలో తీసుకు వెళుతున్నారు చుట్టుపట్టు వ్యవసాయ పనులకు వెళ్లేవారు పశువుల కాపర్లు, విద్యార్థులు క్యాన్లలో బాటిళ్లలో తీసుకపోతుండడం గమన హారం . ఆయాగ్రామాల వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే అధికారులు మరమ్మతులు చేయించి ప్రజల అసౌకర్యాలకు గురవకుండా మరమ్మతులు చేయించాలని సామాజిక కార్యకర్త కాగిత రామచంద్రపురం నివాసి కాంపాటి జోగయ్య అధికారులను కోరారు