
సోషల్ వెల్ఫేర్ కాలేజ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
సోషల్ వెల్ఫేర్ కాలేజ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
E69NEWS ఘనపూర్, జూన్ 21:
యాంటీ డ్రగ్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పల్లగుట్ట క్రాస్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ కాలేజ్ ప్రాంగణంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీపీ రాజమహేంద్ర నాయక్,ఏసీపీ ఘనపూర్,సీఐ,ఎస్ఐ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య నష్టాలు,మానసిక,శారీరక ప్రభావాలు,మరియు మంచి అలవాట్ల అవసరం గురించి వివరించారు.పోలీసు అధికారులు మాట్లాడుతూ..యువత భవిష్యత్తు దశను బాగా ఆలోచించి,డిజిప్లిన్ తో జీవించాలి,డ్రగ్స్ లాంటి మత్తుపదార్థాల వైపు మొగ్గుచూపకూడదని సూచించారు.తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు,సమాజం అంతా కలిసి యువతను రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు.ఈ కార్యక్రమం యువతలో చైతన్యం నింపిందని కాలేజ్ సిబ్బంది తెలిపారు.