
PDSU
సత్యశోధ సమాజ్ 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇల్లందు మండల కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో కుల నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా PDSU జిల్లా కోశాధికారి జె గణేష్ మాట్లాడుతూ….
మహాత్మ జ్యోతిబాపూలే బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సామాజిక పోరాటాలు నిర్వహించాడని జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే ల జీవితం ఆదర్శప్రాయమని ముఖ్యంగా సమాజంలో ఉన్న కుల సమస్యను వారు తీవ్రంగా వ్యతిరేకించారని అందులో భాగంగానే సత్యశోధక్ సమాజ్ స్థాపించి తన ఇంటిలోనే పేదలకు ముఖ్యంగా మహిళలకు విద్యను అందించారని నాటి పరిస్థితుల్లో మహిళను గడప దాటనివ్వని కట్టుబాటుల మధ్యలో జ్యోతిబాపూలే తన భార్య అయిన సావిత్రిబాయి పూలే తోనే చదువు చెప్పించాడని అనేక అవమానాల మధ్య కూడా వెనకడుగు వేయకుండా ముందుకు సాగారని నాటి నుంచి నేటి వరకు కుల సమస్య మాత్రం సమాజంలో మర్రిచెట్టు వేరుల పేరుకుపోయి ఉన్నదని మనిషిని మనిషిగా చూడని సాటి మనిషిని అంటరానివానిగా చూసే కుల వ్యవస్థను నేటికీ పాలకులు పెంచి పోషిస్తున్నారని అందుకొరకే కుల నిర్మూలన అంశాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు k. నవీన్.పల్లవి. ఆకాష్. సంధ్య. సిద్దు. తదితరులు పాల్గొన్నారు