
telugu galam news e69news local news daily news telugu news
తపన్ సేన్
సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి
గళం న్యూస్ హన్మకొండ: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, కార్మి, కర్షకుల ప్రయోజనాలను తాకట్టుపెడుతున్న ప్రధాని మోదీని గద్దె దించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సిఐటియు) ఆలిండియా ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం హన్మకొండ జిల్లాకేంద్రంలో సిఐటియు ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా పబ్లిక్ గార్డెన్‌లోని డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ ఆడిటోరియంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టి. ఉప్పలయ్య అధ్యక్షతన సభ జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ఫాతిమానగర్ బాలవికాసలో సిఐటియు ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం జరిగిన బహిరంగసభలో ముఖ్య అతిథిగా హాజరైన తపన్‌సేన్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నరేండ్లుగా విద్వేష, మత రాజకీయాలు చేస్తుండడంతో దేశ ప్రజల జీవితాలు సంక్షోభంలో కూరుకుపోయాయన్నారు. కేంద్రంలో పాలిస్తున్న ప్రధాని మోదీ ప్రభుత్వం గ్యాస్టోర్గా వ్యవహరిస్తుందన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల హక్కులను కేంద్రం తుంగలోకి తొక్కిందన్నారు. కార్మిక కోడ్లను తీసుకువచ్చి యాజమాన్యాలకు కేంద్రం వత్తాసు పలికి కార్మికు హక్కులను అణిచివేసిందన్నారు. మన పోరాటం కార్పొరేట్, మతోన్మాద శక్తుల మీదనేనన్నారు. అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తున్న మోదీ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదన్నారు. దేశంలో నేతనాల్లో 1 శాతం తగ్గుదల వుందని లెక్కలు చెబుతున్నాయని, ద్రవ్యోల్బణం సైతం పెరుగుతుందన్నారు. మనల్ని రక్షించుకోవడం ద్వారా మనం దేశాన్ని రక్షించాలన్నారు. ఇటీవల దేశంలో ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమ్మె అభినందనీయమైందన్నారు. ఫాసిస్టు విధానాలు తరుచూ విజయాలు సాధించిన దాఖలాలు చరిత్రలో లేవన్నారు. దేశ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతుండగా, ఈ 75 ఏండ్లలో అభివృద్ధి జరుగలేదేని, ఈ తొమ్మిదిన్నరేండ్లలోనే అభివృద్ధి జరిగిందని బిజెపి నేతలు ప్రచారం చేస్తున్నాదన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రధాని మోదీ కార్పొరేట్, బడా వ్యాపారులకు మేలు చేసే విధానాలను అమలు చేస్తూ వారికి మాత్రమే లాభాలు వచ్చేలా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడన్నారు. గత ఏడాది నవంబర్ 26, 27, 28 తేదీలలో దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు ఐక్యంగా ‘సహా పదావ్’ కార్యక్రమంలో 7. లక్షల మంది కార్మికులు పాల్గని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగిందన్నారు. మతాన్ని రాజకీయాల్లో మిళితం చేసి బిజెపి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలని చూస్తుందన్నారు. ఇందులో భాగంగానే జనవరి 22న అయోధ్యలో రామాలయం ప్రారంభించి తనవల్లే రామాలయ నిర్మాణం సాధ్యమైందని ప్రచారం చేసుకుంటూ సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వెల రోజులుగా ఇటువంటి ప్రచారంలోనే కేంద్ర ప్రభుత్వం నిమగ్నమై వుండన్నారు. కేంద్రంలోని బిజెపి తన మత ఎజెండాతో ముందుకు వెళ్తున్నా, మనం మన ఎజెండాతో ముందుకు సాగుతూనే వున్నామన్నారు. ఇందులో భాగంగానే జనవరి 26న అన్ని రాష్ట్రాల్లో రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ట్రాక్టర్, ద్విచక్ర వాహన ర్యాలీలను విజయవంతంగా నిర్వహించామన్నారు. కార్పొరేట్, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ అందోళన కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు.
ఫిబ్రవరి 18వ దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..
పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపుతామని హెచ్చరించడంలో భాగంగా ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని తపన్‌సేన్ కార్మికులను కోరారు. ఇందుకు లక్షలాది మంది కార్మికులను, కర్షకులను సమీకరించి పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలన్నారు. ఈ సమ్మె విజయవంతం నీకెపిని ఓడించేలా పనిచేయాలన్నారు.
బిజెపిని ఓడించకపోతే హక్కులుండవ్
బి.వి. రాఘవులు
సిపిఎం పోలిటి బ్యూరో సభ్యులు
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపిని ఓడించకపోతే దేశంలో హక్కులుండవని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సిఐటియు పూర్వ ప్రధాన కార్యదర్శి బి.వి. రాఘవులు అన్నారు. బిజెపిని ఓడించడమే కర్తవ్యం కావాలన్నారు. దేశంలో మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగానికి, హక్కులకు ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రశ్నించే కవులను, మేధావులను, ఉద్యమకారులను మోచీ జైల్లో పెట్టించారన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల ఆరోగ్యం బాగో లేకపోయిన జైళ్లల్లో వేసి ఇబ్బందులకు గురిచేశారన్నారు. దేశంలో సనాతన ధర్మాన్ని అమలు చేస్తామన…
సిఐటియు కార్మికుల మహా ప్రదర్శన
సిఐటియు ఆలిండియా వర్కింగ్ కమిటీ సమావేశాల్లో భాగంగా హన్మకొండ జిల్లా సిఐటియు నాయకత్వంలో కార్మికుల మహార్యాలీ జరిగింది. బుధవారం హన్మకొండలోని వేయిస్థంబాల దేవాలయం వద్ద ర్యాలీని సిఐటియు ఆలిండియా కోశాధికారి ఎం. సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీలో వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. డప్పు చప్పళ్ల నడుమ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ కార్మికులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మహా ప్రదర్శన హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక్ థియేటర్ నుండి పబ్లిక్ గార్డెన్‌కు చేరింది. ఈ ర్యాలీకి ముందు సిఐటియు నేతలు ఎ. ఆర్. సింధు, లక్ష్మయ్య, టి. ఉప్పలయ్య, రాగుల రమేష్, ఎం. చుక్కయ్య, బొట్ల చక్రపాణి, గొడుగు వెంకట్, ముక్కెర రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.