
రాజకీయ ప్రజాప్రతినిధులు ఏ విధంగా సహకరించారో, పార్లమెంట్ ఎన్నికలకి కూడా సహకరించాలి
శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు సంబంధిత ఇతర రాజకీయ ప్రజాప్రతినిధులు ఏ విధంగా సహకరించారో, పార్లమెంట్ ఎన్నికలకి కూడా సహకరించాలి
ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా తోడ్పాటు అందించాలని ఎలెక్ట్రో రల్ రిజిస్ట్రేషన్ అధికారి, భద్రాచలం ఐటిడిఏ పిఓ ప్రతిక్ జైన్ సంబంధిత ప్రజాప్రతినిధులకు సూచించారు
మణుగూరు తాసిల్దార్ కార్యాలయంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తీసుకోవలసిన కార్యాచరణ పై ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల ప్రజాప్రతినిధులకు కొన్ని సూచనలు ఇస్తూ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మీ అందరి సహకారంతో దిగ్విజయంగా ఎన్నికలు నిర్వహించామని, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా మీ యొక్క సహాయ సహకారాలు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇంకా ఎన్నికల కోడ్ రానందున ప్రస్తుతం ఓటర్ నమోదు కార్యక్రమం నడుస్తున్నందున సంబంధిత తాసిల్దార్లు, బిఎల్వోలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేయాలని, అలాగే ఎన్రోల్మెంట్ అయ్యేలా చూడాలని శాసనసభ ఎన్నికల అప్పుడు ఓటు వేయడానికి పోలింగ్ స్టేషన్లు ఓటర్లకు దూరమైందని ప్రజా ప్రతినిధులు ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి దృష్టికి తీసుకురాగా అటువంటి పోలీస్ స్టేషన్లను గుర్తించి సంబంధిత ఓటర్లను ఫారం 8 ద్వారా భర్తీ చేసి ఓటు బదిలీ చేయాలని, ఇంకా తొమ్మిది సహాయ పోలింగ్ స్టేషన్ల కొరకు ఈసీఐకి ప్రతిపాదనలు తయారుచేసి పంపించి ఓటర్లకు ఓటు వేయడానికి ఇబ్బందులు కలక్కుండా చూస్తామని ఆయన ప్రజా ప్రతినిధులకు సూచించారు. సంబంధిత ప్రజాప్రతినిధులు ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకొని రావాలని పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా జరిగే విధంగా సహకరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాఘవరెడ్డి వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.