
డబ్ల్యూఎఫ్టియు 80వ వార్షికోత్సవం సందర్భంగా కార్మిక సంఘాల నిరసన
గాజాపై మారణహోమం ఆపాలి!! సామ్రాజ్యవాదం నశించాలి!!!
` డబ్ల్యూఎఫ్టియు 80వ వార్షికోత్సవం సందర్భంగా కార్మిక సంఘాల నిరసన
పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని తక్షణమే నిలుపుదల చేయాలని, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని, సామ్రాజ్యవాద యుద్ధం నశించాలని, గాజాపై మారణహోమం ఆపాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ` ఏఐటియుసి ` ఏఐయుటియుసి తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు (తేది: 03`10`2025)న నిరసన కార్యక్రమం నిర్వహించి, పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (డబ్ల్యుఎఫ్‌టియు) 80 వార్షికోత్సవం సందర్భంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సామ్రాజ్యవాద వ్యతిరేక దినం పాటించాలని, పాలస్తీనాకు సంఫీుభావ దినంగా పాటించాలని పిలుపునిచ్చిందని, ఆ పిలుపులననుసరించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఈ సందర్భంగా వారు ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ, సామ్రాజ్యవాద అమెరికా అండతోనే పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి చేస్తున్నదని, సామ్రాజ్యమనేది యుద్ధోన్మాదం నశించాలని అన్నారు. గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తున్నదని, పాలసీనాలో ఉన్న ఖనిజ సంపద ఆయిల్ నిక్షేపాలపై పట్టు కోసం యుద్ధం చేస్తున్నారు. ఇది తక్షణమే నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రపంచ దేశాలన్నీ గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి సమావేశంలో అమెరికా, ఇజ్రాయిల్ మినహా అన్ని దేశాలు ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలని ఓటు చేశాయని, అమెరికా తన వాట్ పేపర్‌ను ఉపయోగించి ఇజ్రాయిల్‌కు అండగా ఉండడం దుర్మార్గమని, తక్షణమే పాలస్తీనాపై దాడిని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏఐటియుసి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహబూబ్ యూసఫ్, ఎస్. బాలరాజ్, ఏఐటియుసి కో`ఆర్డినేటర్ భరత్, తెలంగాణ ఆఫ్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ సీనియర్ నాయకులు ఎం.ఎన్. రెడ్డి తదితరులు ప్రసంగించి సామ్రాజ్యవాద అమెరికా చర్యలను దుయ్యబట్టడమే కాక, తక్షణమే పాలస్తీనాపై యుద్ధాన్ని ఆపాలని, దానిని స్వతంత్ర దేశంగా గుర్తించాలని అన్నారు. ప్రపంచంలో సామ్రాజ్యవాద దేశ చర్యలకు వ్యతిరేకంగా కార్మికవర్గం నిలబడుతుందని, పాలస్తీనా ప్రజలకు ప్రపంచ కార్మికవర్గం అండగా ఉంటుందని అన్నారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. ఈశ్వర్రావు, పద్మశ్రీ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి కె. రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సుధాకర్, ఏఐటియుసి రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నర్సింహా, సిఐటియు హైదరాబాద్ సౌత్ ఎం. శ్రావణ్‌కుమార్, సెంట్రల్ సిటీ నాయకులు రాములు, నరేష్, వెంకటేశం తదితరులు నాయకత్వం వహించగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఎస్. రావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.