
మరిపెడ మండలం లచ్య తండ గ్రామపంచాయతీలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా శిశు మాసొత్సవాలు కార్యక్రమానికి మరిపెడ ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు హాజరై చిన్న పిల్లలకు అక్షరభ్యాసం చేయించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ మహిళలు,పిల్లలు ప్రతిరోజూ ఆహారంలో చిరుధాన్యాలు ఉండేలా చూసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా వుంటారని తెలిపారు.చిరుధాన్యాలైన జొన్నలు, రాగులు, సజ్జలు, పెసర్లు.. తదితర తృణధాన్యాలలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయనీ వాటి ద్వారా అన్ని రకాల పోషక విలువలు శరీరానికి అంది రోగాల బారిన పడకుండా వుంటారని తెలిపారు అనంతరం అంగన్వాడి టీచర్లు రకరకాల చిరుధాన్యాలతో చేసుకొని వచ్చిన ఆహార పదార్థాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బానోత్ భిక్కు అంగన్వాడి టీచర్లు లీల,శాంతి,రోజా, ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.