
తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
సీఐటీయూ డిమాండ్
ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని మరియు మొబైల్ అంగన్వాడి సెంటర్స్ ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాదమ్మ ఏమేలమ్మ డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్ అంగన్వాడి కేంద్రాలకు పోటీగా మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలతో పిఎం శ్రీ పథకం కింద ప్రీ ప్రైమరీ కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఈ విధానం వల్ల ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు మొబైల్ అంగన్వాడి సెంటర్స్ వల్ల టీచర్స్ అండ్ హెల్పర్ అందించే సేవలు ప్రజలకు దూరం అవుతాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఐసిడిఎస్ ను ప్రైవేటీకరించి ప్రజలకు సేవలను దూరం చేయాలని చూస్తున్నదని విమర్శించారు తక్షణమే పిఎంశ్రీ పథకాన్ని రద్దు చేసి ఆ నిధులను ఐసిడిఎస్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అశాస్త్రీయ నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ ప్రకారం అంగన్వాడీలకు 18 వేల వేతనం తక్షణమే పెంచి ఇవ్వాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు మినీ నుండి మెయిన్ అయిన అంగన్వాడి టీచర్లకు ఇప్పటివరకు 10 నెలల వేతన బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని వేతనాలు మా కుటుంబాలని ఈ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు సుప్రీంకోర్టు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కు గ్రాట్యూటీ, గుజరాత్ హైకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంట్ చేయాలని సూచనలు చేశాయని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాల సూచనలు సైతం పెడ చెవిన పెట్టయని విమర్శించారు తమ పోరాటం కేవలం అంగన్వాడీ అండ్ హెల్పర్స్ కోసం మాత్రమే కాదని ఈ దేశంలోని గర్భిణీలకు,చిన్నారుల కోసం నాణ్యమైన పౌష్టికాహారం అందించడం కోసం కూడా పోరాడుతున్నామని అన్నారు రిటైర్మెంట్ అయిన అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కు ఎలాంటి షరతులు లేకుండా ఆసరా పించన్ అమలు చేయాలని ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒక పూట బడి మే నెల అంతా ఇద్దరికీ సెలవులు నిర్ణయం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఐసిడిఎస్ లో ఖాళీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించి అంగన్వాడి అండ్ హెల్పర్స్ పై అదనపు పని భారాలను తగ్గించాలని డిమాండ్ చేశారు ఐసిడిఎస్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకునేందుకు దీర్ఘకాలంలో తాము చేసే కార్మిక వర్గ ఉద్యమాలకు ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వివి నరసింహ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ తెలంగాణ అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు సలోమి సీతమ్మ మోహనమ్మ అరుణ జ్యోతి ఫరీద ఆది లక్ష్మి తదితరులు పాల్గొన్నారు