
సూర్యాపేట డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు జిల్లా కన్వీనర్ తుమ్మ సతీష్ కుమారుడు బర్త్డే సందర్భంగా శుక్రవారం కోదాడ పట్టణంలో తేజ టాలెంట్ స్కూల్లో వందమంది పిల్లలకు నోట్ బుక్స్ పెన్నులు పంచడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మ సతీష్ మాట్లాడుతూ.. నా కుమారుడు బర్త్ డే సందర్భంగా పిల్లలందరికీ నోట్ బుక్స్ పెన్నులు పంచటం ఆనందంగా ఉందన్నారు .మరో మూడు రోజుల్లో పరీక్షలు జరుగునున్నవి కావున మీరందరూ మంచిగా పరీక్షలు రాసి ఉన్నత శిఖరాలకి వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జానకి రావు టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు