
పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి సిఐటియు
నాలుగో రోజు దీక్షలను సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు గతంలో సమ్మె చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 2000 వేతనం పెంచుతున్నామని ప్రకటించి నేటి కి కూడా ఆ నిధులు విడుదల చేయలేదని వెంటనే వాటిని విడుదల చేయాలని అలాగే అనేక కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని వారి కనీస వేతనం 26,000 ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పని భద్రత కల్పించాలని డిమాండ్ చేసినారు ఇప్పుడున్న పనికి అదనంగా ఉదయం రాగి జావ కాయటం అలాగే అల్పాహార కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నందున వారికి పని భారం పెరుగుతున్నందున తక్షణమే వారి డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని కోరినారు నాలుగో రోజు సమ్మెకు సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి సంఘీభావం తెలియజేశారు. అంగనవాడి యూనియన్ బాధ్యులు కార్యదర్శి లలిత సీనియర్ అంగన్వాడి నాయకులు విపుల, విజయలక్ష్మి, తిరుపతమ్మ తదితరులు సంఘీభావం తెలియజేశారు మధ్యాహ్నం భోజనం కార్మిక సంఘం నాయకులు పిలక శివమ్మ ,అక్కల జ్యోతి ,మరియు సభ్యులు పాల్గొన్నారు.