
సిపిఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య డిమాండ్
పెండింగ్ లో ఉన్న తునికాకు బోనస్ వెంటనే ఇవ్వాలని సిపిఎం నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భద్రాచలం ఎఫ్ డి ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి సంబంధిత ఫారెస్ట్ అధికారి కి మెమొరాడం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2016 నుండి 2021 వరకు తునికాకు సేకరించిన కార్మికులకు బోనస్ డబ్బులు తమ అకౌంట్లో జమ కాలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అధికారుల తప్పిదం వల్ల అకౌంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ మార్పు చేయడం వల్ల తునికాకు సేకరించిన కార్మికులు నష్టపోతున్నారని కార్మికుల ఎకౌంట్లో తునికాకు బోనస్ వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే కార్మికుల అకౌంట్లలో తొలికాకు బోనస్ జమ చేయని యెడల భవిష్యత్ పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నిమ్మల మధు, కొమరం చంటి,సరియం ప్రసాద్, కళ్ళేదారులు మడకం జోగయ్య,సోంది రాజు, కల్లూరి రామకృష్ణ, ఉబ్బ ముత్తయ్య, మడకం లక్ష్మి, సోడా శ్యాంబాబు,తోడం జోగారావు, పెనుబల్లి హరీష్, సున్నం కాంతారావు ,కార్మికులు తదితరులు పాల్గొన్నారు.