పెన్షనర్స్ భవనంలో గురుపూజ దినోత్సవం
ఉపాధ్యాయులు ఉత్తమ సమాజ నిర్మాతలు అని సమాజాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. మంగళవారం గురుపూజ దినోత్సవం సందర్భంగా కోదాడ పట్టణంలోని స్థానిక పెన్షనర్స్ భవన్లో అధ్యక్షులు వేనేపల్లి.శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తమమైన సమాజాన్ని నిర్మించే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు.అనంతరం నిష్ణాతులైన ఉపాధ్యాయులను, విశ్రాంత ఉద్యోగులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు,ఎర్రం శెట్టి లక్ష్మీ నరసయ్య, రఘువర ప్రసాద్,భ్రమరాంబ,గడ్డ నరసయ్యతదితరులు పాల్గొన్నారు