
పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలి-రామచంద్ర రావు
వైద్యం అభివృద్ధి చెందటమె కాదు ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా చూడాలి÷ప్రముఖ ప్రకృతి వైద్యులు రామచంద్రరావు……..
పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలి÷రామచంద్ర రావు…….
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెమినార్……
సెమినార్ లో పాల్గొన్న ప్రముఖ వైద్యులు రామచంద్రరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్………
ఖమ్మం ఆగస్టు 12, 2023…..
వైద్యం అభివృద్ధి చెందటమె కాదు ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా చూడటమే ప్రభుత్వాల బాధ్యతని ప్రముఖ ప్రకృతి వైద్యులు రామచంద్ర రావు అన్నారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ "పెట్టుబడిదారీ సమాజం-ప్రజల ఆరోగ్యం"అనె అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ అధ్యక్షుడు జరిగిన ఈ సెమినార్కు వక్తగా ప్రముఖ ప్రకృతి వైద్యులు రామచంద్ర రావు హాజరై ప్రసంగించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ సమాజంలో వైద్యం కూడా ఒక సరుకుగా మారిందని, కార్పొరేట్ వైద్యంతో ప్రజల దగ్గర డబ్బులను దోచుకుంటున్నారని ఈ సందర్భంగా అన్నారు. ల్యాబుల పేరుతోనూ టెస్టుల పేరుతోనూ, టాబ్లెట్స్ పేరుతోనూ మోసపూరితమైన వైద్యంతో డబ్బులు దండుకుంటున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన అభివృద్ధి అంటే వైద్యం అభివృద్ధి చెందటమే కాదని, అనారోగ్యానికి గురికాకుండా చూడడమే నిజమైన అభివృద్ధి అని సందర్భంగా గుర్తు చేశాడు. ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం, సమాజాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ప్రజలకు ఆహారం అందుబాటులో ఉంచడం, వ్యాయామం ఇతర ఆరోగ్య సూత్రాలను ప్రజలకి తెలియజేయడం లాంటి విషయాలు అభివృద్ధి చెందాలని సందర్భంగా అన్నారు. ప్రభుత్వాలు ఇట్లాంటి పనులు చేయకుండా కార్పొరేట్ శక్తులు ఊడిగా చేస్తున్నాయని, దీని ఫలితంగా ప్రజలు దోపిడీ గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక ఉపశమనం కోసం ఇచ్చే పెయిన్ కిల్లర్స్ ఇతర స్టెరాయిడ్స్ వాడటం వల్ల కిడ్నీలు చెడిపోవడం క్యాన్సర్లు రావడం బీపీలు షుగర్ రావడం జరుగుతుందని మెడికల్ మాఫియా జరుగుతుందని ఆయన అన్నారు. అందరూ డాక్టర్లు ఇలా చేయడం లేదని చాలామంది డాక్టర్లు ప్రజల కోసం పని చేస్తున్నారని ఆయన సందర్భంగా గుర్తు చేశాడు. ప్రజల కోసం పనిచేసే ప్రజా వైద్యులు ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటారని ఆయన అన్నారు.
ఈ సెమినార్ లో రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండి రమేష్ గారు పాల్గొని ప్రసంగించారు .
కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ .బషీరుద్దీన్, జిల్లా నాయకులు సత్తెనపల్లినరేష్, చింతల రమేష్, భూక్య ఉపేందర్ నాయక్, శీలం వీరబాబు, యంగ్ వుమెన్ రాష్ట్ర కన్వీనర్ పఠాన్ రోషిని ఖాన్, జిల్లా కన్వీనర్ పదముత్తుముష, కో కన్వీనర్ మాడపాటి సుజాత, దిండు మంగపతి, కూరపాటి శ్రీను, పొన్నం మురళి, విజయ్, రావులపాటి నాగరాజు, శ్యామ్, దాసరి మహేందర్, రాంబాబు, భాష షేక్ నాగుల్ పాషా, మురళి ,శభాష్ రెడ్డి, కొంగర నవీన్ ఎర్ర సాయి ఎర్ర నగేష్, పుష్పరాజు, రెహమాన్ రమణ, సాయి తదితరులు పాల్గొన్నారు