
ఈ రోజు సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కన్వీనర్ బోట్ల చక్రపాణి మాట్లాడుతూ.. మహబూబాద్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం పక్కన సర్వ్ నుంబర్ 255/1లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఇండ్లు లేని నిరుపేదలు గత సంవత్సర కాలంగా ఇట్టి భూమిలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఇట్టి గుడిసెవాసుల గుడిసెలను ఈ రోజు స్థానిక అధికారులు, భారీగా పోలిసుల బాలగంతో వచ్చి గుడిసెలను కూల్చివేసి, లాఠీ ఛార్జి చేయడాన్ని సిపిఎం హనుమకొండ జిల్లా కమిటీ ఖండిస్తోందన్నారు.
ప్రభుత్వం ఓకే పక్క ప్రభుత్వ స్తలంలో గుడిసెలు వేసుకొని ఉంటె జి.ఓ నో. 58 ప్రకారం దరఖాస్తు చేసుకొమ్మని చెబుతూనే మరో పక్క పేదల గుడిసెలను పీకడం ప్రభుత్వం యొక్క రెండు నాల్కల ధోరణికి అడ్డం పడుతుందన్నారు.
ప్రభుత్వం వెంటనే పెదాలు వేసుకున్న గుడిసెలకు పట్టాలివ్వాలని, లేని యెడల రాష్ట్ర వ్యాపితంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చక్రపాన్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, జి.ప్రభ్కర్ రెడ్డి, గొడుగు వెంకట్, మంద సంపత్, వాంకుడోతు వీరన్న తదితరులు పాల్గొన్నారు.