
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదలు వేసుకున్న గుడిసెల్ని తొలగించడం అన్యాయం .గుడిసెల్ని తొలగించిన అధికారులను సస్పెండ్ చేయాలి. వీరోచితంగా పోరాడుతున్న పేద ప్రజలకు అభినందనలు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్తూ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వెనుక భాగాన సర్వే నెంబరు 255/1 లో పది ఎకరాల ప్రభుత్వ భూమిలో గత ఆరు నెలలుగా సిపిఎం ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మహబూబాబాద్ మున్సిపాలిటీ వాళ్లు, కలెక్టర్ ఆఫీస్ వాళ్లు, రెవెన్యూ వాళ్లు, ఫారెస్ట్ వాళ్లు ,పోలీసు వాళ్ళ సహాయంతో జెసిపిలను పెట్టి గుడిసెల్ని తొలగించడం అన్యాయమని భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి బందు సాయిల్ అన్నారు. ఇప్పటికి మహబూబాబాద్ లో అధికారులు నాలుగుసార్లు గుడిసెల్ని తొలగించారు. అయినా పేద ప్రజలు వీరోచితంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయటం అభినందనీయం . ఈరోజు ఉదయం జెసిపిలు పెట్టి గుడిసెల్ని తొలగించి, గుడిసెలలో ఉన్న సామాన్లను సుందర వందనం చేసి మహిళల్ని దొబ్బేసి, ఆడవాళ్ళని చూడకుండా తోపులాట చేసి భయానకమైన వాతావరణాన్ని మహబూబాబాద్ గుడిసెలలో ప్రభుత్వం కల్పించింది. ఇట్టి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పేదలపై పెట్టిన అక్రమ కేసులు అన్నిటిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూమిలో నివాసముంటున్న పేద ప్రజలందరికీ 125 గజాల స్థలం ఇచ్చి ఇంటి పట్టాలు మంజూరు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేసుకోవడానికి ఐదున్నర లక్షల రూపాయలు మంజూరు చేయాలి. మోడీ సర్కారు చేసిన వాగ్దానం ఇట్టి స్థలం ఉన్న వారికి 10 లక్షలు ఇస్తామని మాటిచ్చారు. అట్టి డబ్బులు ఇప్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 15 .50 లక్షలు పేద ప్రజలకు ఇంటి నిర్మాణం కోసం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో ప్రతి మనిషికి కూడు, గూడు, గుడ్డ ఉండాలని రాజ్యాంగంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు. వీటిని ప్రభుత్వం అమలుపర్చకపోవడం అత్యంత దుర్మార్గమైన చర్య. రాజ్యాంగాన్ని అమలుపరచినటువంటి ప్రభుత్వాలు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిందే. మహబూబాబాద్ గుడిసె లేసిన పేదలు తిరిగి అట్టి స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని వారికి అండగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరినీ సమీకరించి సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన తోపులాటలో నిర్బంధాల్ని అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఎండి రఫీ ,ఏ శ్రీధర్ ,రమేష్ శేఖర్, చిన్న రాజాకు తదితరులు పాల్గొన్నారు.