
ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలని జిల్లా మైనార్టీ నాయకులు ఖలీల్ అహ్మద్ అన్నారు.శనివారం మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీలను అక్కున చేర్చుకున్నాడని ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే సభకు మైనారిటీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు జలీల్ అహ్మద్, బుడేమియా తదితరులు ఉన్నారు.