
ప్రజలను మోసం చేస్తున్న మోడీ సర్కార్
వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం లోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం లో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అబిడి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య సంయుక్తంగా మాట్లాడుతూ” మోడీ ప్రభుత్వం జీఎస్టీ పన్నుల విధానంలో సంస్కరణల పేరుతో తీసుకువచ్చిన మార్పులు పేద మధ్య తరగతి వర్గానికి ఉపయోగపడదని ఇది మోడీ ప్రభుత్వ మోసకారితనము అని ఏడు సంవత్సరాల క్రితం తీసుకువచ్చిన విధానం వల్ల దేశంలో పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులే లాభపడ్డారు వారికి దేశ ప్రజల లక్షల కోట్ల రూపాయలు సొమ్మును పన్నుల ద్వారా రూపాయి నా ద్వారా దారాదత్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల వసూల్లో తమకు ఉండే అధికారాలు కోల్పోయాయి మోడీ ప్రభుత్వం ఏకైక కేంద్ర విధానాలకు అమలు చేస్తూ రాజ్యాంగం కల్పించిన సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పోషాల వెంకన్న గౌడ్. కొత్తపెళ్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగిరి గౌడ్. మండల సీనియర్ నాయకులు మరుపట్ల సాయికుమార్. జాబర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా’ కార్యదర్శి చిదుముల్లా భాస్కర్. తదితరులు పాల్గొన్నారు.