
rti news
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని పీపల్ పహాడ్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమం ను స్పెషల్ ఆఫీసర్ శ్రీలక్ష్మీ, మండల తహశీల్దార్ హరికృష్ణ, గ్రామ సర్పంచ్ సీఎచ్ రాణి రంగారెడ్డి, ఎంపీటీసీ దోసపాటి జ్యోతి జంగయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్టీఐ సతీష్ హాజరయ్యి ఆర్టీఐ రక్షక్ హెల్ప్ డెస్క్ ద్వారా గ్రామ ప్రజలకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రజా పాలన దరఖాస్తులను ఎలా నమోదు చేసుకోవాలో స్థానికులకు వివరించి వాటిని స్వయంగా నమోదు చేసి వారికి అందించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరు వివరాలు నమోదు చేసుకుని ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలని ఆకాంక్షించారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారిని చైతన్య పరుస్తు ముందుకు వెళ్తున్న ఆర్టీఐ రక్షక్ సంస్థ సభ్యులను మండల తహశీల్దార్ హరికృష్ణ గారు అభినందిస్తూ ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు ఆర్టీఐ రక్షక్ సంస్థ ద్వారా గ్రామ గ్రామాన విస్తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రక్షక్ టీం సభ్యులు రోశనగరి యాదయ్య, లందగిరి సాయి ,బుగ్గ రాములు, కోళ్ల సైదులు, బి.వెంకటేష్, అంజయ్య, యు. వెంకటేశం తదితరులు హాజరయ్యారు..