ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలి
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా,కార్మిక,రైతు వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు పిలుపునిచ్చారు.ఈ విధానాలకు నిరసనగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా మండల కేంద్రాల ముందు నిర్వహించనున్న ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన ప్రజలను కోరారు.వరంగల్లో తెలంగాణ రైతు సంఘం,సీఐటీయూ,వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆర్థిక అసమానతలు పెరిగాయని,దేశ సంపదలో 60% కేవలం 1% మంది కోటీశ్వరుల చేతిలో పోగుపడిందని విమర్శించారు.ముఖ్య డిమాండ్లు:ప్రైవేటీకరణతో విద్య,వైద్య రంగాలలో పెరుగుతున్న దోపిడీని అరికట్టాలి.రైతు వ్యతిరేక చట్టాలను పరోక్షంగా అమలు చేయడం ఆపి,గిట్టుబాటు ధరల చట్టం తేవాలి.కార్మిక వ్యతిరేకమైన నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి.ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం ఆపి,పటిష్టంగా అమలు చేయాలి.కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నాయకులు ఉద్ఘాటించారు.