
హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఈ69న్యూస్ హన్మకొండ న్యూస్ మార్చి 17
హనుమకొండ కలెక్టరేట్ లో వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ నిర్వహించారు.ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను కలెక్టర్ ప్రావీణ్య,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు.జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో 76 అర్జీలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ సమస్యలను పెండింగ్ లో లేకుండా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై వి గణేష్,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి,హనుమకొండ,పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్,డాక్టర్ నారాయణ,ఇతర జిల్లా అధికారులతో పాటు పలువురు తహసిల్దార్లు పాల్గొన్నారు.