Brinda Karat Accuses BJP-RSS of Obstructing Women’s Rights in India
బాధితుల పక్షాన పోరాటాలు
‘ఐద్వా’ జాతీయ మహాసభల్లో బృందాకరత్
భారతదేశంలో అన్యాయాన్ని ప్రతిఘటించిన ప్రతి ప్రాంతంలోనూ బలహీనులకు అండగా ఐద్వా జెండా నిలిచిందని మాజీ ఎంపీ, ఐద్వా జాతీయ ప్యాట్రన్ బృందాకరత్ స్పష్టంచేశారు. ఇండ్లలో, బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో ఎక్కడైనా ప్రజలకు తోడుగా నిలిచి, భరోసా కల్పించి, విశ్వాసాన్ని పెంచడంలో ఐద్వా చేసిన కృషి ఎనలేనిదని చెప్పారు. మహిళా రెజ్లర్ల పోరాటం, ఆర్జీకార్ చారిత్రాత్మక పోరాటం, హత్రాస్ కేసు, కుల్దీప్ సెంగర్ బాధితురాలు, అంకితా భండారి కేసు సహా మహిళలు హింసను ఎదుర్కొన్న ప్రతిచోట వారికి తోడుగానే ఉన్నామని తెలిపారు. బెంగాల్లో టీఎమ్సీ ప్రభుత్వానికీ, త్రిపురలో బీజేపీ ప్రభుత్వానికి, రాజకీయ అణచివేతలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన పోరాటంలో ఐద్వా ముందు వరుసలో ఉందని గుర్తుచేశారు. దోపిడీదారులైన మైక్రో ఫైనాన్స్ కంపెనీలు మహిళలను అప్పుల ఊబిలోకి నెడితే, బాధితుల పక్షాన నిలిచామన్నారు. నరేగా చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం జీ రాంజీ పేరుతో నిర్వీర్యం చేస్తున్నదనీ, దానికి వ్యతిరేకంగా మరింత బలోపేతమైన ఉద్యమాలు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో ఇండ్ల స్థలాల కోసం మహిళల ఆధ్వర్యంలోనే భూపోరాటాలు జరిగాయని గుర్తుచేశారు. మహారాష్ట్రలోని పాల్హర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ మహిళల భారీ సమీకరణలు, లక్నో, ఢిల్లీల్లోని పట్టణ మురికివాడల్లో మహిళలు బుల్డోజర్ను ఎదుర్కొన్న చోట, బిల్కిస్ బానోకు మద్దతుగా, ఛత్తీస్ గఢ్ సన్యాసినులకు మద్దతుగా నిలిచామన్నారు. ఆదివారంనాడిక్కడ జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభ ప్రారంభకార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేరళలో ప్రత్యామ్నాయ విధానాలను రక్షించడానికీ, రాష్ట్రంలోని కొత్త వర్గాల మహిళలను చేరుకోవడానికి కొనసాగుతున్న పోరాటంలో ఐద్వా కృషి కొనసాగుతూనే ఉందన్నారు.
ప్రజా ఉద్యమాలకు సంఘీభావం
ప్రజాఉద్యమాలకు సంఘీభావం, ఐక్య పోరాటాలు, కార్మికులకు మద్దతు ఇవ్వడం, స్కీమ్ వర్కర్లు, రైతు ఉద్యమాలలో ఐద్వా ముఖ్యమైన పాత్ర పోషించిందని తెలిపారు. దానిలో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 12న జరిగే అఖిల భారత సమ్మెకు మద్దతుగా ఐద్వా సభ్యులు వీధుల్లోకి వస్తారని చెప్పారు. కులవివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం ఐద్వా నిరంతరం పోరాడుతూనే ఉ ంటుందన్నారు.
సోషలిజమే ప్రత్యామ్నాయం
దేశానికి సోషలిజమే ప్రత్యామ్నాయమనీ, దాన్ని తాము పూర్తిగా విశ్వసిస్తామని బృందాకరత్ స్పష్టంచేశారు. కేంద్రంలోని ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ- ఆర్ఎస్ఎస్ పాలన భారత రాజ్యాంగంలోని లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమానత్వ విలువలకు విఘాతం కల్పిస్తున్నాయని చెప్పారు.
హక్కుల హననం
అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను లేబర్కడ్ల పేరుతో కార్మిక హక్కుల హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను రక్షించాలనీ, మతతత్వ మనువాద సంస్కృతులను తిప్పికొట్టాలనీ, నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా మహిళల హక్కులను రక్షించాలని డిమాండ్ చేశారు.
సామ్రాజ్యవాదానికి మోడీ జీ హుజూర్
అంతర్జాతీయంగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా సామ్రాజ్యవాదానికి మోకరిల్లేలా ఉంటున్నాయని అక్షేపించారు. గాజాపై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న మారణకాండను తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వ మౌనాన్ని తప్పుపట్టారు. గాజాలో బాధితులుగా మిగిలిన ప్రజలకు బలమైన మద్దతును అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ పదే పదే ఉల్లంఘిస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైలెంట్‌గా
ఉంటున్నా, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా ఆరెస్టు చేయాల్సిన సమయంలో భారత ప్రధాని మోడీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పున్నారని ఎద్దేవా చేశారు. వెనిజులా అధ్యక్షుడు నికోంస్ మదురోను అమెరికా దశాలు ‘అక్రమంగా ఆవహరించి ఎత్తుకెళ్లడాన్ని ఆమె తప్పుపట్టారు అమెరికా అధ్యక్షుడు క్రుంప్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే కనీసం అది తప్పు అని కూడా చెప్పలేని నిస్సహాయ స్థితిలో భారత ప్రభుత్వం ఉన్నడని చెప్పారు. క్యూబా, మెక్సికో దేశాలు ఇప్పుడు ముప్పులో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు.
నకిలీ జాతీయవాదం
మోడీ ప్రభుత్వ నకిలీ జాతీయవాదం ఆయన చర్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నడని బృందాకరత్ ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వారిశక్తి వంటి ఉద్యమ నినాదాలను హైజాక్ చేయడానికి ప్రయత్నిస్తూనే మహిళల హక్కులపై వాడిని ముమ్మరం చేసిందని చెప్పారు. దానిలో భాగమే ఎమ్ జీఎస్ఆర్జీఎ రద్దు అని ఉదహరించారు. దీన్ని ‘ఐద్యా తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
పేదరికాన్ని లెక్కించడంలోనూ భావదారిద్య్ర్యం
దేశంలో పేదరికం 5 శాతమే ఉందని కేంద్రం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.57 కంటే తక్కువ వేతనం ఉంటే దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్టే అని కేంద్రం సూత్రీకరిస్తున్నదనీ, ఆ సొమ్ముతో కనీసం అరలీటరు నూనె కూడా రాడవే. విషయాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. దారిద్య్రం కొలమానాన్నే మార్చేసి, దేశంలో పేదలు లేరని ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు..
మహిళారిజర్వేషన్ల అమలుపై మౌనం
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలు విషయంలో 2024లోనే బిల్లు పార్లమెంటు ఆమోరం పొందినా, మనువాద బీజేపీ మౌనంగా ఉంటున్నదనీ, ఇంకెంతకాలం దేశంలోని మహిళా లోకాన్ని మోసం చేస్తారని ప్రశ్నించారు.
వరకట్న మరణాలపై స్పందించరేం…
దేశంలో ఏటా ఏడువేల మంది హిందూ మహిళలు వరకట్నాలకు బలవుతున్నారనీ, అలాంటివారి గురించి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు. ఆడపిల్లల వివాహ విషయంలోనూ ఆర్ఎస్ఎస్ ఆంక్షలు విధిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.
విద్వేషాలే బీజేపీ అజెండా
దేశంలో కేవలం మతాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారానే అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తున్నదనీ, ఇలాంటి చర్యంపట్ల ప్రజలు ఆప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పేద ముస్లిం వ్యాపారులపై దాడులు చేస్తున్నారనీ, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
హిందువులకూ ఒరిగిందేం లేదు
బీజేపీ అధికారంలో కొనసాగడం వల్ల మెజారిటీ హిందువులకు కూడా ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవనీ, ఆ వాస్తవాలను గమనించాలని సూచించారు. రాజకీయ అధికారం కోసం మతాన్ని దుర్వినియోగం చేయడాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కుల వివక్షను ప్రోత్సహించే మనుస్మతిని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పే ధైర్యం బీజేపీ, ఆర్ఎస్ఎస్కు లేదన్నారు.
చట్టసభల్లో నేరస్తులు
మహిళలపై హింస, అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులే చట్టసభల్లో ప్రతినిధులుగా చలామణి అవుతున్నారనీ, అలాంటి వారు బీజేపీలోనే అధికసంఖ్యలో ఉన్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడిన నేరస్తులు ధైర్యంగా జైళ్ల నుంచి విడుదల అవుతున్నారనీ, దీనివల్ల సమాజానికి బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నడని నిలదీశారు. గృహిణులు అంటే తక్కువ భావన సరికాదన్నారు. వారి శ్రమకు విలువకడితే అది ఆపారం అవుతుందని వివరించారు. ‘సర్’ పేరుతో మహిళల ఓట్లనే లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్నారని, ఇలాంటి చర్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వామపక్షాలకు అండగా నిలవండి.
రాజ్యాంగ విలువలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్న వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల విజయాన్ని నిర్ధారించడంలో మహిళలు ముఖ్య పాత్ర పోషించాలని చెప్పారు. మహిళలు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మహిళలకు ఇచ్చే పెన్షన్ల విషయంలో వారికేదో ప్రయోజనం కలిగిస్తున్నట్లు మాట్లాడుతున్నారనీ, ఆ సొమ్ము ప్రజలదే తప్ప ఆయా నేతల ఇండ్ల నుంచి తెచ్చింది కాదని స్పష్టంచేశారు.
ప్రజాస్వామ్య సమీకరణకు అనేక అవకాశాలు
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 36.6 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయనీ, మిత్రపక్షాలతో కలిపితే అది 43 శాతమేనని విశ్లేషించారు. దేశంలో 57 శాతం మంది ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారనే వాస్తవాలను గమనించాలని చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య సమీకరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.