
ప్రపంచ శాంతికే అహ్మదీయ కమ్యూనిటీ కృషి
మధురవాడలోని మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీలో శుక్రవారం సాయంత్రం అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆధ్వర్యంలో “ప్రపంచ శాంతి”అంశంపై ఘనంగా సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా కమ్యూనిటీ నూరుల్ ఇస్లాం శాఖ డైరెక్టర్,జాతీయ ప్రెస్ & మీడియా ఇన్ఛార్జ్ ఇండియా కె.తారిఖ్ అహ్మద్ మాట్లాడుతూ…“ప్రపంచం నేడు క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది.ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించడం మాకెంతో ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తున్నాం.అందుకోసం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా శాంతి సమ్మేళనాలు,చర్చాగోష్టులు,సదస్సులు నిర్వహిస్తూ,మేధావులు,విద్యావేత్తల సలహాలను తీసుకుంటూ ప్రపంచ శాంతి స్థాపనకు నిరంతర కృషి చేస్తున్నాం.అన్ని మతాల అవతార పురుషులను పరస్పరం గౌరవించినప్పుడే శాంతి స్థాపించగలమని”అన్నారు.విశాఖపట్నం కమ్యూనిటీ అధ్యక్షులు షేక్ దర్గా సాహెబ్ మాట్లాడుతూ..ప్రస్తుతం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ 200కు పైగా దేశాలలో వ్యాపించి,ధార్మిక యుద్ధాలకు ముగింపు పలికే లక్ష్యంతో పనిచేస్తోంది.రక్తపాతం ఆపి సమానత్వం,న్యాయం,మత సామరస్యంతో కూడిన నవ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తోంది.ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ నేతృత్వంలో ‘అందరిని ప్రేమించు-ఎవ్వరినీ ద్వేషించకు’అనే నినాదంతో హ్యూమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మానవ సేవా కార్యక్రమాలు చేపడుతోంది”అని తెలిపారు.కళాశాల ప్రిన్సిపల్,అధ్యాపకులు కమ్యూనిటీ చేస్తున్న శాంతి కార్యక్రమాలను అభినందించారు.ఈ కార్యక్రమంలో మిషసరీ ఇన్ఛార్జ్ ఆదిల్ అలీ,రాష్ట్ర ప్రజా సంబంధాల అధికారి ముహమ్మద్ జావిద్ అహ్మద్ పాషా,షేక్ జిలానీ,సత్తార్ తదితరులు పాల్గొన్నారు