
ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులు
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పగానే కార్మికులు ఆనందోత్సవాలు, సంబరాలు చేసుకుంటున్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తూ మంత్రిమండలి కీలక నిర్ణయంపై ఆర్టీసీ సిబ్బంది స్వాగతించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఆర్టీసీ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మక నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనది.
ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులకు అండగా కేసీఆర్
తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ నష్టాలను పూడ్చుకుంటూ క్రమంగా లాభాల్లోకి తెచ్చే క్రమంలో కరోనా వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా కేసీఆర్ వెనుకడుగు వేయలేదు. వేలాదిమంది ఉద్యోగుల జీవితాలతో ముడి పడి ఉన్నందున ఆర్టీసీని ఆదుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. లక్షలాది మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ జనాల హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసీకి కెసిఆర్ అండదండలు అందించారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. జీతాలు లేక వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడినా ఉద్యమానికి ఊపిరు లుదారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి వేతనాలు పెంచారు. ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి భరోసా కల్పించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు రావడం చిన్న విషయం కాకున్నా, కార్మికుల సంక్షేమం కోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా ఆర్టీసీకి పునర్వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. ఆర్టీసీ సంస్థ, ఉద్యోగుల బాగోగుల పట్ల కేసీఆర్ ఒక నిబద్ధతతో వ్యవహరించారు. ప్రయాణికులను పలు ఆఫర్లతో ఆకట్టుకోవటంతో పాటు, మారుమూల గ్రామాలకు కూడా ఆర్టీసీ సేవలు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రచారం చేయడం ద్వారా ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కొత్త బస్సులను ప్రవేశపెట్టి ప్రయాణీకులకు మరింత సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నారు దీంతో ప్రయాణికులకు ఆర్టీసీ పట్ల మరింత నమ్మకం పెరిగింది. ఆర్టీసీలో ప్రస్తుతం 9200 బస్సులున్నాయి. అందులో 2800 అద్దె బస్సులు. కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ఆధునిక సౌకర్యాలతో బస్టాండ్లు, నూతన బస్‌డిపోలు నిర్మించడం ద్వారా ప్రయాణికులకు ఆర్టీసీ మరింత చేరువైంది. అలాంటి ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో భరోసానిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి కూడా సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ రవాణాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఉద్యోగుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారు. తెలంగాణ వచ్చాక ఆర్టీసీ స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి సంస్థను ఒక తోవలో పెట్టి,.. ఉద్యోగులకు పూర్తి భరోసా ఇచ్చారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సంస్థను నిలబెట్టి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించారు కేసీఆర్. ‘కార్మికులు’ అనే పదాన్ని తీసివేసి ‘ఉద్యోగులు’గా వారి గౌరవాన్ని మరింత పెంచారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీని ఆదుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. రాష్ట్ర ఉద్యమ సమ్మె సమయంలో కెసిఆర్ పిలుపు ఇస్తే బస్సులు రోడ్డు మీదకు రాలేదు. ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముందువరుసలో ఉండేది. ఎ ఒక్క బస్సు కూడా కదలలేదు. తెలంగాణ స్వరాష్ట్రం వచ్చినప్పటి నుండి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. కార్మికుల కుటుంబాలలో నూతన కాంతులు వెలుగుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో అరకొర జీతాలతో నెట్టుకొచ్చిన ఆర్టీసీ కార్మికులకు ఇది తీపి కబురని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అదునుగా పనిచేసే ఆర్టీసీ సిబ్బందికి తెలంగాణ సర్కారు మహనీయకోణంలో ఆర్టీసీ కార్మికుల కష్టానికి ప్రతిఫలం ఇస్తూ వారి జీవితాలలో వెలుగు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆర్టీసీ సిబ్బంది రుణపడి ఉంటారు. ఆర్టీసీ సంస్థలో 43, 373 మంది కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ విధివిధానాలను రూపొందించాలని ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులు సంతోషిస్తూ హర్షిస్తున్నారు. కానీ నాలుగేళ్ల క్రితం కార్మికులు ఈ డిమాండ్ లేవనెత్తినప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉంటే 47 రోజుల పాటు సమ్మె చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సుమారు 50 మందికి పైగా కార్మికులు ప్రాణాలు పోకుండా దక్కేవి.
ప్రభుత్వ నిర్ణయం ఆనందంగా ఉంది..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా.. ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షాలు, కొన్ని యూనియన్లు ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారని, ఆస్తులు అమ్మేస్తారని ప్రచారం చేశారు. వారి ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో కార్మికులందరికీ భరోసా లభించింది. కార్పొరేషన్ వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం. సీఎం కేసీఆర్ దయ వల్ల ఈరోజు మా కష్టాలు తీరాయి. కార్మికుల కుటుంబ సభ్యులు, కార్మికులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
నిజమైన నాయకుడు సీఎం కేసీఆర్…
గతంలో ఉన్న ఏ నాయకుడు తీసుకోలేని నిర్ణయం సీఎం కేసీఆర్ తీసుకోవడం అభినందనీయం. ఇలాంటి నా యకుడు ప్రజలకు, ఉద్యోగులకు ఎంతైనా అవసరం ఉంది. ఈ నిర్ణయంతో వేల మంది ఉద్యోగులకు దారి చూపిన మహనీయుడుగా చరిత్రలో నిలిచిపోనున్నారు. కానీ కేసీఆర్ లాంటి నాయకుడితో ఏదైనా సాధ్యం అవుతుందని మరోసారి నిరూపణ అయింది..