
కోనాయిచలం ప్రభుత్వ భూములో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించనుండడం అభినందనీయం
నాడు సిపిఎం పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారా సాధించిన కోనాయిచలం ప్రభుత్వ భూమిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం అభినందనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు పేర్కొన్నారు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం తిమ్మంపేట జఫర్గడ్ ప్రధాన రహదారి పక్కన గల కోనాయిచలం గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 161 లో 26 ఎకరాల 20 గుంటల ప్రభుత్వ భూమిని నాటి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కంచే చేను మేసిన చందంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అక్రమంగా కొనాయిచలం భూములను కాజేశారు
కొనయిచలం గ్రామ శివారులో 161 సర్వే నెంబర్ లో అక్రమ పట్టాలను వెంటనే రద్దుచేసి ఆ భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలను నడిపింది ఆ భూమిని కాపాడుకునేందుకు పేదలచే గుడిసెలు వేయించింది వివిధ పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి సిపిఎం ప్రజా ఉద్యమాల ఒత్తిడి ఫలితంగా నాటి జిల్లా కలెక్టర్ దేవసేన విచారణ జరిపించింది. ప్రభుత్వ భూమి అని నిర్ధారించి రెవెన్యూ అధికారులతో హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది నాడు సిపిఎం ప్రజల ఉద్యమాల ఫలితంగా కోట్లరూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి దక్కిందన్నారు
నేడు ఆ ప్రభుత్వ భూమిలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యనందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుండడం హర్షనీయమని రాపర్తి రాజు అన్నారు
ఇటీవల జనగామ జిల్లా పర్యటనలో భాగంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ వచ్చిన సందర్భంగా కొనయిచలం ప్రభుత్వ భూములను కూడా సందర్శించడం జరిగిందని పార్టీ నాయకత్వాన్ని అభినందించినట్లు తెలిపారు
జిల్లాలో అన్యక్రాంతమైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు సిపిఎం ఉద్యమాలు నిర్వహిస్తుందని సిపిఎం ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వ భూములు కాపాడబడుతున్నట్లు చెప్పడానికి నిదర్శనం అని రాపర్తి రాజు అన్నారు