జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
ఈరోజు ది 24-05-2023 న జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనం లో TPCC,CLP అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఖమ్మం జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన విషయం మీకు తెలుసు ఈ సభ్యత్వ నమోదు చేసిన కూసుమంచి మండల కార్యకర్తలు ఇటీవల చనిపోయినారు,గంగబండ గ్రామంలోని వడిత్య లాల్ సింగ్,ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పేరెల్లి లక్ష్మి లు చనిపోయినారు ఈరోజు వారి కుటుంబ సభ్యులు వదిత్యా రంగమ్మ మరియు పేరెల్లి కోటయ్య లకు జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల (2,00,000/) చెక్కులను అంధిచినారు
ఈ సందర్భంగా పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పేద,బడుగు వర్గాల ప్రజలకు,కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని,ఇన్సూరెన్స్ కార్యక్రమం ప్రవేశ పెట్టిన AICC ఆదినాయకత్వానికి,TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి,CLP నేత భట్టి విక్రమార్క మల్లు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు అనంతరం
పాలేరు నియోజకవర్గ పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని కాంగ్రెస్ పార్టీ ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకొచ్చి చనిపోయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు చేదోడు కొంత ఆర్ధిక సాయం వారి కుటుంబ సభ్యులకు అందించటం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గర్వకారణం అని TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి,CLP నేత భట్టి విక్రమార్క మల్లు గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో వీరితో పాటు కూసుమంచి మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మట్టే గురవయ్య,ఖమ్మం రూరల్ మండల కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, మద్ది వీరారెడ్డి,ముత్యాలగూడెం సర్పంచ్ బొల్లికొండ శ్రీనివాస్, పెండ్ర అంజయ్య, తనగంపాడు సర్పంచ్ కేతినేని వేణు,మంకెన వాసు,దాసరి వెంకన్న,వీరబద్రం,రామిరెడ్డి,రమేష్ రెడ్డి,మోహన్,మంచాయ్యా నాయక్ మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.